కాంగ్రెస్ వ్యూహాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న టీఆర్ఎస్

దుబ్బాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాలతో ఉక్కిరిబిక్కిరి అవుతుంది టీఆర్ఎస్ పార్టీ. చెరుకు శ్రీనివాసరెడ్డికి మద్దతుగా కాంగ్రెస్ సీనియర్ నేతలు అందరూ కదిలి రావటం, నియోజకవర్గంలోని పల్లెపల్లెలోకి దూసుకెళ్లి ప్రచారం నిర్వహిస్తుండటంతో టీఆర్ఎస్ పార్టీ హైకమాండ్ ఆత్మరక్షణలో పడింది. ప్రచారంలో వెనకబడింది.

అభ్యర్థి సోలిపేట సుజాత వీక్ గా ఉండటంతో భారం అంతా మంత్రిపైనే వేసుకున్నారు. ఇప్పటికే మంత్రి హరీశ్ వ్యవహారశైలిపై నియోజకవర్గంలో అసమ్మతి తీవ్రంగా ఉంది. బయట నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులకు నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డి తనదైన స్టయిల్ లో దూసుకువెళుతున్నారు. ప్రతి గ్రామంలో ఓటర్లను పేరుపేరున పలకరించే స్థాయిలో ఉన్న అతని నెట్ వర్క్, పరిచయాలు బాగా కలిసి వస్తున్నాయి. ఆయా గ్రామాల్లోని స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ..

టీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ ముందుకు వెళుతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం సర్కార్ ఉద్యోగాలు ఎన్ని ఇచ్చింది.. ఎంత మంది డబుల్ బెడ్ రూం ఇళ్లు వచ్చాయి అనే ప్రశ్నలను సంధిస్తూ యువతను ఆకట్టుకుంటున్నారు.

పార్టీలతో సంబంధం లేకుండా కిసాన్ సేవా సమితి ఆధ్వర్యంలో లబ్ధిపొందిన వేలాది మంది ఆప్తులు.. చెరుకు శ్రీనివాసరెడ్డి వెంట నడుస్తున్నారు. ఇదంతా టీఆర్ఎస్ పార్టీకి కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. టీఆర్ఎస్ ప్రచారానికి ఇబ్బందిగా మారింది. మన బిడ్డ..

ముత్యంరెడ్డి బిడ్డ.. మనం గెలిపించుకుందాం.. నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళదాం అంటూ ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి