ఈ కానిస్టేబుల్ నిజమైన హీరో

ఈ కానిస్టేబుల్ నిజమైన హీరో

పోలీసులు అంటే చాలామంది బయపడతారు. అంతే కాదు కొందరైతే వారిని చాలా డేంజర్ అని చెబుతుంటారు. ఎవరి ఉద్దేశం వారిది.. కానీ కొందరు పోలీసులు చేసే పనులు ప్రజల మనసులను దోస్తాయి. తాజాగా హైదరాబాద్ కు చెందిన ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ రోడ్డుపై నిలిచి ఉన్న నీరును పక్కకు పంపేందుకు పారపట్టుకొని కాలువ తవ్వారు.

రోడ్డుపై మొత్తం నీరు కాలువలోకి పోయ్యేలా చేశారు. దీంతో ఆ కానిస్టేబుల్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. ఆయన చేసిన పనిని పోలీస్ డిపార్టుమెంటు కూడా మేచుకుంది. ఇక ఇటువంటిదే మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ ట్రాఫిక్ పోలీస్ రోడ్డు ఉద్చుతున్నాడు.. రోడ్డుపై ఇసుక ఉండటంతో వాహనాలు స్కిడ్ అవుతున్నాయి.

వాహనదారులు కొండపడుతున్నారు. అంతేకాక ఆ ఇసుక ఉన్న వైపుకు పోయేందుకు ఎవరు దైర్యం చేయడం లేదు. దీంతో సగం రోడ్డుపైనే వాహనాలు తిరగాల్సి వస్తుంది. కొంచం ఇసుక తీస్తే రోడ్డు మొత్తం ఉపయోగంలోకి వస్తుంది అని ఆలోచించిన ట్రాఫిక్ పోలీస్ అనుకున్నదే తడవుగా పొరక పట్టాడు. రోడ్డుపై ఉన్న ఇసుకను పక్కకు తోశాడు.

ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా మొత్తం క్లియర్ చేశాడు. పోలీస్ శుభ్రం చేస్తుండగా కొందరు ఈ వీడియో తీశారు. దీనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన ఉన్నతాదికారులు కానిస్టేబుల్ చేసిన పనిని మేచుకున్తున్నారు. కాగా ఈ సంఘటన ఒరిసా రాష్ట్రంలోని కటక్ పట్టణంలో జరిగింది.. ఈ పట్టణం హైదరాబాద్ మాదిరిగానే ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది.

 

 

 

 

 

 

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి