ఈ సంగీతం వింటే కరోనా మాయం.

ఈ సంగీతం వింటే కరోనా మాయం.

కరోనా.. కనిపించని ఈ మహమ్మారి ప్రపంచ దేశాలను కబళిస్తుంది. ప్రజా జీవనాన్ని అస్తవ్యస్తం చేసిన మందులేని ఈ వైరస్ ప్రైవేట్ ఆసుపత్రులకు మాత్రం కాసులు కురిపించింది.

అయితే డబ్బుకు ఆశపడకుండా వైరస్ బాధితులు మహమ్మారి నుంచి బయటపడితే అదే కోటి అని భావించిన గుజరాత్ రాష్ట్రము వడోదరాలోని సయాజీరావు గైక్వాడ్ ఆసుపత్రి కొత్త విధానానికి తెరలేపింది..

సంగీతంతో కరోనాను నయం చేసేందుకు కృషి చేస్తుంది.. ఎంతటి జబ్బునైన నయం చేస్తే శక్తి సంగీతానికి ఉందని పెద్దలు చెబుతున్నారు. అందులో భాగంగా కరోనా సోకిన వారి కోసం ప్రత్యేకంగా మ్యూజిక్ థెరపీని ప్రారంభించారు.

ఈ థెరపీ వల్ల రోగులు ప్రశాంతంగా ఉండగలుతారని, దాని వల్ల మానసిక స్తైర్యం పెరిగి కరోనా రోగులు త్వరిత గతిన వైరస్ బారి నుంచి బయటపడగలుగుతారని డాక్టర్లు భావిస్తున్నారు. ఈ థెరపీ మంచి ఫలితాలు ఇస్తుందని చెబుతున్నారు డాక్టర్లు

మీ అభిప్రాయం కామెంట్ చేయండి