కరోనా మహమ్మారిని అరికట్టేందుకు అన్ని దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇప్పటికే రష్యా, అమెరికా టీకాలు రెడీ చేశాయి. రష్యా ఆ దేశ ప్రజలకు టీకాలు ఇచ్చింది. కాగా భారత్ లో టీకా టెస్టింగ్ దశలో ఉంది. ఇది వచ్చే ఏడాది తోలి త్రైమాసికంలోపు అందుబాటులోకి రానున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖామంత్రి హర్షవర్ధన్ తెలిపారు.
టీకా సామర్థ్యంపై ప్రజల్లో ఉన్న భయాలను పోగొట్టేందుకు దానిని తొలుత తానే తీసుకుంటానని పేర్కొన్నారు. ఈ విషయాన్నీ ఆదివారం తెలిపారు.. సండే సంవాద్ అనే ఆన్ లైన్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. టీకా అందుబాటులోకి వచ్చిన వెంటనే ఆరోగ్య కార్యకర్తలు, వృద్ధులకు ఇస్తామన్నారు. ఖర్చుతో సంబంధం లేకుండా అత్యవసరమైన వారికి అందిస్తామన్నారు. టీకాపై ప్రజల్లో నమ్మకం కలిగించేందుకు తాను వలంటీర్‌గా మారి తొలుత తీసుకుంటానని అన్నారు.
మీ అభిప్రాయం కామెంట్ చేయండి