మరదలితో రెండో పెళ్లి.. నిప్పు పెట్టిన మొదటి భార్య

మరదలితో రెండో పెళ్లి.. నిప్పు పెట్టిన మొదటి భార్య

గురువారం అర్ధరాత్రి కృష్ణా జిల్లా మచిలీపట్నం మార్కెట్‌యార్డు చైర్మన్‌ అచ్చేభా తనయుడు ఎస్‌కే ఖాదర్‌బాషాపై హత్య యత్నం జరిగింది. కట్టుకున్న భార్యే అతడిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టింది.. ఈ ప్రమాదంలో 45 శాతం కాలిన గాయకతో ఎస్‌కే ఖాదర్‌బాషా విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

వివరాల్లోకి వెళితే,, ఎస్‌కే ఖాదర్‌బాషా నూరుద్దీన్‌పేటకు చెందిన నజియాను పదేళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఓ కూతురు, ముగ్గురు కుమారులు ఖాదర్‌బాషా స్థానికంగా బంగారం దుకాణం నడుపుతాడు. ఏడాది కాలంగా బాషా ప్రవర్తనలో మార్పు రావడంతో ఆమె పలు మార్లు మందలించింది. అయినా మార్పు రాలేదు.

ఈ నేపథ్యంలోనే మూడు నెలల క్రితం భాష, నజియా చెల్లలు మహిబాను పెళ్లి చేసుకున్నాడు. ఆమె వద్దనే ఎక్కువ ఉంటున్నాడు. అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి వెళ్తున్నాడు. గురువారం రోజు మహిబాను తల్లిగారి ఇంటి వద్ద దింపి, నజియా ఇంటికి వచ్చాడు బాషా, అయితే అప్పటికే అతడు మద్యం సేవించి ఉన్నాడు.

ఇంటికి వచ్చిన భర్తతో సఖ్యతగా మాట్లాడింది. ఇక అర్ధరాత్రి భాషా నిద్రిస్తున్న సమయంలో ప్లాన్ ప్రకారం ఇంట్లో తెచ్చిపెట్టుకున్న పెట్రోల్ పోసి నిప్పు పెట్టింది. దింతో మంటల దాటికి పైకి లేచి కేకలు వేశాడు బాషా, చుట్టుపక్కల వారు వచ్చి మంటలు ఆర్పీ అతడి తండ్రి అచ్చేభాకు సమాచారం అందించారు.

దింతో అతడు అక్కడికి చేరుకొని బాషాను మచిలీపట్టణం ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లాడు. పరిస్థితి విషమించడంతో విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. కాగా 45 శాతం కాలిన గాయాలతో ఖాదర్ బాషా చికిత్స పొందుతున్నాడు. ఇక బాధితుడి నుంచి వాంగ్మూలం తీసుకున్న పోలీసులు భార్య కోసం గాలిస్తున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు