భారతీయ సామాజిక ధర్మానికి రామాయణం గొప్ప ప్రాతిపదిక 

భారతీయ సామాజిక ధర్మానికి రామాయణం గొప్ప ప్రాతిపదిక 

 

వాల్మీకి జయంతిని పురస్కరించుకొని, దేశ వ్యాప్తంగా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే శ్రీకాకుళం జిల్లాలో వాల్మీకి మహర్షి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన వేడుకలలో డిప్యూటీ సీఎం ధ‌ర్మాన కృష్ణ‌దాస్‌, అసెంబ్లీ స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం, జిల్లా క‌లెక్ట‌ర్ జే.నివాస్, ప‌లువురు ఉన్న‌తాధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా ధర్మాన క్రిష్ణదాస్ మాట్లాడుతూ వాల్మీకి మహర్షి జీవితం అందరకీ ఆదర్శమని, ప్రతి ఒక్కరూ ఆయన చరిత్ర తెలుసుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా వుందని అన్నారు. ఒక బోయవాని ఇంట జన్మించిన వాల్మీకి మహర్షిగా మారి, పవిత్ర రామాయణ గ్రంథాన్ని మనకు అందించారని తెలిపారు. అతను రచించిన పవిత్ర రామాయణ గ్రంథం యావత్ సమాజానికి మార్గదర్శకమన్నారు.

ఇక సీఎం గురించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి బి.సిలకు పెద్దపీట వేశారని అన్నారు. తనను ఉప ముఖ్యమంత్రిగా, తమ్మినేని సీతారాంకు శాసనసభ స్పీకర్ గా నియమించిన సంగతిని ఉపముఖ్యమంత్రి గుర్తుచేసారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి