నువ్వెంత నీ ప్రభుత్వం ఎంత.. బీజేపీ దృష్టిలో టీఆర్ఎస్ పీనెట్స్ : ఎంపీ అరవింద్ సంచలన వార్నింగ్

నువ్వెంత నీ ప్రభుత్వం ఎంత.. బీజేపీ దృష్టిలో టీఆర్ఎస్ పీనెట్స్ : ఎంపీ అరవింద్ సంచలన వార్నింగ్

హైదరాబాద్ లో బీజేపీ అరాచకాలు సృష్టించనుంది.. లాఠీఛార్జి చేయించుకుని రక్తపాతంతో అలజడులు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ చేసిన ఆరోపణలపై నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ కౌంటర్ ఇచ్చారు. మా కార్యకర్తలతో ఇలాంటి నీచమైన పనులు చేయాల్సిన అవసరం లేదని.. బీజేపీ పార్టీ, ప్రభుత్వంతో పోల్చుకునే స్థాయి టీఆర్ఎస్ కు లేదని కౌంటర్ ఇచ్చారు.

బీజేపీ ముందు టీఆర్ఎస్ పీనెట్స్ అంటూ చులకన చేశారు ఎంపీ. జీరో ఎఫెక్ట్ పెడితేనే నిజామాబాద్ లో నీ చెల్లెలు కవితను ఓడించాం.. కరీంనగర్ లో మీ మామను ఓడించాం.. గట్టిగా ఎఫెక్ట్ పెడితే సిరిసిల్లలో నిన్ను.. గజ్వేల్ లో మీ నాన్నను కూడా ఓడిస్తాం అంటూ మంత్రి కేటీఆర్ ను ఉద్దేశించి సంచలన వార్నింగ్ ఇచ్చారు ఎంపీ అర్వింద్.

బీజేపీ కార్యకర్తలపై కాల్పులు జరిగితే.. శాంతి భద్రతలు అదుపుతప్పితే.. రాష్ట్రపతి పాలన వస్తుందని.. ఈ విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. తెలంగాణ హోం మంత్రి ఉన్నారా లేరా.. ఉంటే ఎక్కడ ఉన్నారు.. ఆయన చెప్పాల్సిన మాటలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎలా చెబుతారు.. మంత్రిగా ఎందుకు చెప్పటం లేదు అని మంత్రి కేటీఆర్ ను ప్రశ్నించారు బీజేపీ ఎంపీ అరవింద్. ఇలాంటి చౌకబారు ఆలోచనలు ఎలా వస్తాయి అంటూ వెటకారాలు ఆడారు. దుబ్బాకలో సీఎం కేసీఆర్ ప్రచారం చేసి ఉంటే కనీసం 100 ఓట్లు అయినా వచ్చేవని.. ఇప్పుడు అవి కూడా రావన్నారు. టీఆర్ఎస్ పార్టీకి దుబ్బాకలో ఓటమి ఖాయం అని.. ఎన్ని జిమ్మిక్కులు, డ్రామాలు ఆడినా ఉపయోగం లేదు అన్నారు ఎంపీ అరవింద్.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి