దేశరాజధాని ఢిల్లీ బాంబు పేళుల్లతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఢిల్లీలోని స్థానిక అబ్దుల్ కలామ్ మార్గ్ లో ఈ పేలుడు చోటుచేసుకుంది. పేలుడు దాటికి అక్కడ ఉన్న మూడు కార్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. పేలుడు జరిగిన ప్రాంతానికి కేవలం 40 – 50 మీటర్ల దూరంలోనే ఇజ్రాయిల్ ఎంబసీ కార్యాలయం ఉండటంతో అన్ని దేశాల ఎంబసీ కార్యలయాల వద్ద అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
రిపబ్లిక్ డే ముగింపు వేడుకలు జరుగుతున్న సమయంలో ఈ పేలుడు జరగడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. పేలుడు జరిగిన నిమిషాల వ్యవధిలోనే అన్ని ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను వెంటనే ఆర్పివేశారు.
బాంబు పేలుళ్లలో IED వాడినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ఘటనలో ఎవరు గాయపడలేదని తెలుస్తుంది. ఇప్పటికే బాంబ్ స్క్వాడ్ ను రంగంలోకి దింపిన అధికారులు అనుమానిత ప్రదేశాలన్నింటిని తనిఖీ చేస్తున్నారు.
Israel is treating a small bomb blast near the Israeli embassy in Delhi today, which did not injure anyone, as a terrorist incident: Reuters quoting an Israeli official
— ANI (@ANI) January 29, 2021