రిచీ మెహతా రచనా దర్శకత్వంలో వచ్చిన ఢిల్లీ క్రైమ్ వెబ్ సిరీస్‌కు అంతర్జాతీయంగా గుర్తింపు లభించింది. నెట్‌ఫ్లిక్స్‌లో 7 ఎపీసోడ్లుగా విడుదలైన ఈ సిరీస్‌కు.. ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డు దక్కింది. బెస్ట్ డ్రామా సిరీస్ కేటగిరీలో ఎంపికైంది. ఈ విషయాన్ని ఎమ్మీ అవార్డుల ట్విట్టర్లో అధికారికంగా వెల్లడించారు. గోల్డెన్ కరవాన్ నిర్మాతగా వ్యవహరించిన ఈ సిరీస్.. బెస్ట్ డ్రామా కేటగిరీలో ఎంపికైందని స్పష్టం చేసింది.
మనదేశంలో రాజధాని నడిబొడ్డున చీకట్లో సాగిన అరాచకం నిర్భయ ఘటనపై ఈ సిరీస్ రూపొందించారు. ఆనాటి దుర్మార్గమైన చర్య తర్వాత జరిగిన పరిణామాలపై సిరీస్‌ను తీశారు. శెఫాలీ షా.. డీసీసీ వర్తికా చతుర్వేది రోల్లో నటించారు. ఈ సిరీస్‌లో పూర్తిగా ఆడవారే నటించారు. బాధితుల నుంచి అధికారి వరకు అందరూ మహిళలతో నిర్మించిన ఈ సిరీస్‌కు అవార్డు దక్కడం ఆనందంగా ఉందంటూ.. శెఫాలీ ఓ వీడియోను ఆడియన్స్‌తో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఇన్వెస్టిగేషన్ పార్ట్‌కు సహకరించిన ఢిల్లీ పోలీసులకు ధన్యవాదాలు తెలిపింది.
ఇటు ముందుగా.. నిర్భయకు ఘన నివాళులు అర్పించారు. మనదేశంలో తీసిన ఓ వెబ్ సిరీస్‌కు అంతర్జాతీయ అవార్డు దక్కడం ఇదే మొదటిసారని.. కరోనా కారణంగా.. వర్చువల్ పద్దతిలో 48వ అవార్డుల వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా ఢిల్లీ క్రైమ్ టీమ్‌కు.. శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.