ఈ ప్రభుత్వాలను అస్సలు నమ్మం – మోడీని అసలే నమ్మం : వలస కార్మికులతో దద్ధరిల్లిన ఢిల్లీ..

కరోనా విజృంభణతో.. సడెన్ గా లాక్ డౌన్ ప్రకటించారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. ఈ ప్రకటన చేస్తున్న సమయంలోనే ఓ మాట చెప్పారు.. వలస కార్మికులు ఎక్కడికీ వెళ్లొద్దు.. వాళ్లను ఆదుకుంటాను.. లాక్ డౌన్ కేవలం ఆరు రోజులు మాత్రమే అని స్పష్టం చేశారు. ఎన్ని రోజులు అనే సమస్య కాదు ఇక్కడ.. ఈ ఆరు రోజులు ఎలా బతకాలి అనేది అతి సామాన్యుడి సమస్య అయిపోయింది. ఎవరికి వాళ్లు.. వాళ్ల వాళ్ల అవసరాల మేరకు ముందస్తుగా నిత్యావసరాలు, లిక్కర్ తెచ్చిపెట్టుకున్నారు.

ఢిల్లీ మహా నగరంలో 35 శాతం మంది వలస కార్మికులే.. వీళ్లు కేజ్రీవాల్ చేసిన లాక్ డౌన్ ప్రకటన నమ్మకం కలిగించలేకపోయింది. అందరూ వారి సొంతూళ్లకు వెళ్లేందుకు బస్టాండ్, రైల్వేస్టేషన్ పోటెత్తారు. లక్షల మంది అర్థరాత్రి సమయంలో ఢిల్లీ వీధుల్లో కదం తొక్కారు. ఇప్పుడు ఆరో రోజులు అన్నారు.. రేపు మరో ఆరు రోజులు అంటారు.. ఆ తర్వాత నెల రోజులు అంటారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవాళ కేజ్రీవాల్ లాక్ డౌన్ అన్నారు.. రేపు మోడీ లాక్ డౌన్ అంటారు.. ఈ ప్రభుత్వాలను అస్సలు నమ్మం.. ఈ మోడీని అసలే నమ్మం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఢిల్లీలోని వలస కార్మికులు. సొంతూళ్లకు వెళ్లేందుకే ప్రయత్నిస్తున్నారు.

delhi migrant labour

వలస కార్మికుల డిమాండ్ ను క్యాష్ చేసుకుంటున్నాయి ట్రావెల్ కంపెనీలు. వెయ్యి రూపాయల టికెట్ ను.. నాలుగు వేలకు అమ్ముతున్నారు. నిన్నటి వరకు ఐదు వేలకు వచ్చిన వెహికల్ అద్దెను.. ఇప్పడు 20 వేలకు పెంచారు. ప్రభుత్వాలు ముందస్తు జాగ్రత్తలు, చర్యలు లేకుండా సడెన్ గా లాక్ డౌన్ ప్రకటిస్తే.. రోడ్లపై ఉండే మా పరిస్థితి ఏంటని ఆలోచించరా అని కేజ్రీవాల్ ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వలస కార్మికులు.

కరోనా తీవ్రంగా ఉందని.. ఈసారి ఎవరి మాటలు నమ్మం అని.. ఏ ప్రభుత్వాన్ని.. చివరికి మోడీ మాటను కూడా నమ్మం అంటున్నారు వలస కార్మికులు. ఓ సారి అనుభవించాం.. మళ్లీ ఎలా నమ్ముతాం అని ఎదురు ప్రశ్నిస్తున్నారు.

delhi filled migrant labour

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు