హత్య కేసులో నాగేంద్ర అరెస్టుకు రంగం సిద్ధం

హత్య కేసులో నాగేంద్ర అరెస్టుకు రంగం సిద్ధం

విజయవాడలో కలకలం రేపిన దివ్య హత్యకేసులో హంతకుడు నాగేంద్రను అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు పోలీసులు. అరెస్ట్ కు సంబందించిన విషయాలను సీపీ బత్తిని శ్రీనివాస్ సోమవారం మీడియాకు తెలిపారు. దివ్య తేజశ్విని హత్య కేసులో విచారణ పూర్తయినట్లు తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేశామన్నారు.

ఫోరెన్సిక్‌, మెడికల్‌ రిపోర్టులు కూడా వచ్చాయి. దివ్య.. నిందితుడి నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఆ సమయంలోనే ఆమె చేతులకు కత్తిగాట్లు పడ్డాయి. నాగేంద్ర గొంతుకోసి అత్యంత దారుణంగా హత్య చేశాడు. చేతులు అడ్డుపెట్టడంతో చేతులపై కూడా క్రూరంగా దాడి చేశాడు.. ఈ మానవమృగం చేతిలో తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది దివ్య.. కాగా లీగల్‌ ఫార్మాలిటీస్‌ పూర్తి చేసి, డిశ్చార్జ్‌ అవగానే అరెస్ట్ చేస్తాము.

కోర్టులో హాజరు పరిచాక న్యాయమూర్తి అనుమతితో కస్టడీలోకి తీసుకొని మరిన్ని వివరాలు రాబడతామని తెలిపారు సీపీ శ్రీనివాస్. కాగా ప్రజా సంఘాల నేతలు నాగేంద్రను ఎన్కౌంటర్ చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. అంట క్రూరంగా ఓ అమ్మాయిని చంపిన వాడిని వదలొద్దని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి