ఒకే ఫ్రేమ్ లో.. సంప్రదాయ దుస్తుల్లో ఎన్టీఆర్ – చెర్రీ

స్వీట్స్ తినిపిస్తున్న స్టిల్ కూడా ఉంది. ఇద్దరు హీరోలను ఒకే ఫ్రేంలో చూడడంతో ఫ్యాన్స్‌కు

దీపావళి పండుగ సందర్భంగా ట్రిబుల్ ఆర్.. రౌద్రం రణం రుధిరం మూవీ అభిమానులకు శుభాకాంక్షలు చెప్పారు హీరోలు ఎన్టీఆర్, రాంచరణ్. తారక్, చెర్రీ ఇద్దరూ ట్రెడిషనల్ దుస్తుల్లో చిరునవ్వులు చిందిస్తున్న ఫొటోలకు ఫోజులిచ్చారు. దివాళీ డెకరేషన్ చేసిన సెట్ లో.. పక్కన స్వీట్స్ పెట్టి ఉంటాయి. ఇద్దరూ ఒకరిని చూసి ఒకరు నవ్వుతూ ఉంటారు. వారితో జక్కన్న స్వీట్స్ తినిపిస్తున్న స్టిల్ కూడా ఉంది. ఇద్దరు హీరోలను ఒకే ఫ్రేంలో చూడడంతో ఫ్యాన్స్‌కు దివాళీ ఆనందం డబుల్ అయ్యింది.

ఈ మూవీలో NTR కొమరం భీంగా, మెగా పవర్‌స్టార్ రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రల్లో నటిస్తుండగా.. స్వాతంత్ర్య సంగ్రామం కథ ఆధారంగా.. రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా అండ్ మోస్ట్ అవైటెడ్ మూవీగా.. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది.

అక్టోబర్ 22న కొమరం భీం జయంతి సందర్భంగా ఎన్టీఆర్ క్యారెక్టర్ ఇంట్రో వీడియో విడుదల చేశారు. రామ్ ఫర్ భీమ్ టీజర్‌కు భారీ స్పందన లభించింది. దీపావళి సందర్భంగా ప్రేక్షకాభిమానులకు ఆర్ఆర్ఆర్ టీం ఓ సర్‌ప్రైజ్ ఇచ్చింది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి