డాక్టర్ ఇంట్లో 50 లక్షల డబ్బు దోపిడీ – కాళ్లు, చేతులు కట్టసి బీభత్సం

డాక్టర్ ఇంట్లో భారీగా డబ్బు ఉంది అని తెలిసే ఈ దోపిడీ చేసినట్లు అనుమానాలు ఉన్నాయి. లేకపోతే ఆ

బెజవాడలో కలకలం. ఓ ప్రముఖ డాక్టర్ ఇంట్లో దోపిడీ దొంగలు బీభత్సం చేశారు. 2020, సెప్టెంబర్ 15వ తేదీ తెల్లవారుజామున జరిగిన ఘటన సంచలనంగా మారింది. మాచవరంలో డాక్టర్ మురళీధర్ కుటుంబం నివాసం ఉంటుంది. దోపిడీ దొంగలు.. ఇంట్లోకి ప్రవేశించిన సమయంలో డాక్టర్ భార్య, అతని కుమారుడు ఇంట్లో ఉన్నారు. వాళ్లను నిర్భంధించి, కాళ్లు, చేతులు తాళ్లతో కట్టేశారు. నోట్లో గుడ్డలు కుక్కారు.

ఇంట్లోని బీరువాలు అన్ని వెతికారు. 50 లక్షల రూపాయల డబ్బు ఉంది. దీన్ని ఎత్తుకెళ్లారు. దోపిడీ సమయంలో డాక్టర్ మురళీధర్ ఇంట్లో లేరు. కరోనా ట్రీట్ మెంట్ సేవల్లో ఉన్నారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కరోనా రోగులకు ఆయన చికిత్స చేస్తున్నారు.

ఆస్పత్రి డ్యూటీ తర్వాత ఇంటికి వచ్చిన డాక్టర్ మురళీధర్.. షాక్ అయ్యారు. భార్య, కుమారుడి కట్లు విప్పి.. పోలీసులకు కంప్లయింట్ చేశారు. సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. నలుగురు దొంగలు ఈ దోపిడీ చేసినట్లు గుర్తించారు. వారి ఆచూకీ కోసం ఏడు ప్రత్యేక బృందాలను నియమించారు పోలీసులు. నోట్లో గుడ్డలు కుక్కి, కాళ్లు, చేతులు కట్టేసి అత్యంత కిరాతకంగా ఈ దోపిడీ జరిగిందని.. నిందితులను త్వరలోనే పట్టుకుని శిక్షిస్తాం అని బెజవాడ పోలీసులు వెల్లడించారు.

డాక్టర్ ఇంట్లో భారీగా డబ్బు ఉంది అని తెలిసే ఈ దోపిడీ చేసినట్లు అనుమానాలు ఉన్నాయి. లేకపోతే ఆ ఇంటినే టార్గెట్ చేయటం చూస్తుంటే.. పక్కా ప్లాన్ ప్రకారం చేసినట్లు అనుమానాలు ఉన్నాయి పోలీసులకు. దోపిడీ చూస్తుంటే.. కేవలం డబ్బు కోసం మాత్రమే చేశారని.. బాధితులను ఎలాంటి హాని చేసే ఉద్దేశం వారికి లేదని సీన్ చూస్తే తెలుస్తోంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి