దుబ్బాకలో గెలుపుపై టీఆర్ఎస్ కు ఏమైనా డౌట్ ఉందా ఏంటీ : ఎందుకీ హడావిడి.. హైడ్రామా

దుబ్బాకలో గెలుపుపై టీఆర్ఎస్ కు ఏమైనా డౌట్ ఉందా ఏంటీ : ఎందుకీ హడావిడి.. హైడ్రామా

దుబ్బాక ఉప ఎన్నికలో గెలుపుపై టీఆర్ఎస్ పార్టీకి ఏమైనా డౌట్ ఉందా.. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ నెగెటివ్ గా వచ్చిందా.. బీజేపీ గెలుస్తుందా ఏంటీ.. ఆదివారం నుంచి తెలంగాణ ప్రజల్లో ఇదే డౌట్. దీనికి కారణం లేకపోలేదు.. దుబ్బాకలో ఎన్నికల ప్రచారం ముగుస్తుంది.. మరికొన్ని గంటల్లో పోలింగ్ జరగనుంది అనే సమయంలో.. టీఆర్ఎస్ పార్టీ చేసిన హడావిడి, హంగామా, హైడ్రామా వల్లే ప్రజల్లో అనుమానాలు పుట్టుకొచ్చాయి.

టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి అయిన కేటీఆర్.. రాష్ట్రంలో శాంతి భద్రతలు, పోలీస్ వ్యవస్థ గురించి ఎంతో ఘనంగా చెప్పుకునే మంత్రి కేటీఆర్.. హైదరాబాద్ లో బీజేపీ అలజడి సృష్టించబోతున్నది.. లాఠీఛార్జిలు, కాల్పులు చేయించుకోబోతున్నది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది సాధారణమైన కామెంట్ కాదు.. ఎంతో బలమైన నేతగా, బలమైన ప్రభుత్వంగా చెప్పుకుంటున్న టీఆర్ఎస్ పార్టీకి కాబోయే అధినేత, కాబోయే సీఎంగా ప్రచారం చేసుకుంటున్న మంత్రి కేటీఆర్ అనటంతోనే అందరికీ సందేహాలు వ్యక్తం అయ్యాయి.

ఎంపీ, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు డీజీపీని కలిసి మరీ వినతిపత్రం ఇచ్చారు. బీజేపీ పార్టీ కుట్ర అంటూ పోలీస్ బాస్ కు లేఖ ఇచ్చారు. బీజేపీ కుట్ర చేస్తే దాన్ని తిప్పికొట్టే వ్యూహం, పోలీస్ బలగంతో ఎదుర్కొనే సత్తా టీఆర్ఎస్ ప్రభుత్వం చేయాలి కదా.. బీజేపీ ఆందోళనలకు పిలుపు ఇవ్వకుండానే.. స్వయంగా మంత్రి కేటీఆర్ ఇలా ప్రకటించటం వెనక వ్యూహం ఏంటో అర్థం కాలేదు.

హైదరాబాద్ లో కోటి రూపాయల హవాలా డబ్బు దొరికింది అని.. అది దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు కోసం తరలిస్తుంది అని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ స్వయంగా ప్రకటించారు. ఈ డబ్బు కూడా మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ కంపెనీ అయిన విశాక ఇండస్ట్రీ ఆఫీసులో సీజ్ చేశారు. దుబ్బాక ఎన్నికల డబ్బు అయితే సిద్దిపేటలో పట్టుకోవాలి లేక దుబ్బాకలో పట్టుకోవాలి.. అలా కాకుండా హైదరాబాద్ లో సీజ్ చేయటం.. అది దుబ్బాక డబ్బు అని చెప్పటం వెనక సామాన్య ప్రజల్లో డౌట్ వస్తుంది. ఎన్నికల కోడ్ లేని హైదరాబాద్ లో దుబ్బాక డబ్బు సీజ్ చేయటం ఏంటీ అనే సందేహం, అనుమానాలు కూడా ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి.

సరిగ్గా వారం క్రితం దుబ్బాక ఎన్నిక ప్రచారంలో ఓ డైలాగ్ వచ్చింది. నిజామాబాద్ లో సీఎం కేసీఆర్ కుమార్తె కవితనే ఓడించాం.. దుబ్బాకలో సుజాతను ఓడించలేమా అని.. ఈ లెక్కన చూస్తుంటే కాంగ్రెస్ – బీజేపీ మళ్లీ వ్యూహాత్మకంగా దుబ్బాకలో టీఆర్ఎస్ పార్టీని ఓడించటానికి ప్లాన్ చేశాయని టీఆర్ఎస్ బలంగా నమ్ముతుందా.. దుబ్బాకలో అదే జరుగుతుందా.. టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందా ఏంటీ అనే డౌట్ అందరిలో వ్యక్తం అయ్యింది.

దుబ్బాక ఎన్నికల ప్రచారంలో మొదట్లో ఉన్న ఊపు, ఉత్సాహం చివర్లో తగ్గిపోయాయి అనేది దుబ్బాక ప్రజల్లో వ్యక్తం అయ్యిందా.. నియోజకవర్గాన్ని మూడు భాగాలు చేసి బీజేపీ – కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ప్రచారంతోపాటు కుల సమీకరణలతో ఎత్తుగడలు వేసిందా.. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లో టీఆర్ఎస్ పార్టీకి నెగెటివ్ టాక్ వినిపించిందా ఏంటీ అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

ఏమీ లేకపోతే టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ రోజంతా దుబ్బాకపై ఇంత హడావిడి చేయటం ఏంటీ

దుబ్బాక ఎన్నికల ప్రచారాన్ని అంతా తానై చేసిన మంత్రి హరీశ్ రావు దుబ్బాకను గట్టెక్కించలేరు అనే డౌట్ మంత్రి కేటీఆర్ కు వచ్చిందా ఏంటీ..

ఆదివారం టీవీలు చూసినోళ్లు అందరికీ ఇలాంటి డౌట్స్ చాలా వచ్చాయి.. వాటిలో కొన్ని మాత్రమే ఇవి…

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు