ప్లాస్టిక్ కప్పుల్లో టీ తాగుతున్నారా?.. అయితే జాగ్రత్త.
కరోనా మహమ్మారి మనిషి జీవన విధానాన్ని మార్చింది. గతంలో ఏ వైరల్ మనుషుల జీవన విధానంపై ఇంతగా ప్రభావం చూపలేదు. కరోనా వచ్చిన నాటినుంచి రీ యూస్ వస్తువులను చాలా వరకు తగ్గించారు. యూస్ అండ్ త్రో వస్తువులకే ప్రజలు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చాల వరకు టీ స్టాల్స్ వద్ద ప్లాస్టిక్, డిస్పోజబుల్ పేపర్ కప్పులలో టీ తాగుతున్నారు.
dont-use-plastic-cut
ఇలా టీ తాగడం చాలా ప్రమాదకరమని ఖరగ్ పూర్ ఐఐటీ పరిశోధకులు తెలిపారు. డిస్పోజబుల్ పేపర్ కప్పుల్లో టీ తాగడం వలన శరీరంలో ప్లాస్టిక్ రేణువులు చేరుతాయని వారు హెచ్చరించారు. మూడు సార్లు 100 మిల్లీలీటర్ల చొప్పున టీ తాగడం వల్ల 75 వేల అతిసూక్ష్మ హానికర ప్లాస్టిక్ కణాలు మానవ శరీరంలోకి వెళతాయని తెలిపారు. 80-90 డిగ్రీల సెంటిగ్రేడ్ వేడి కలిగిన 100 మిల్లీలీటర్ల ద్రవ పదార్థం ద్వారా దాదాపు 25 వేల మైక్రాన్ల ప్లాస్టిక్ కణాలు మనలోకి చేరతాయని అన్నారు.
దీంతో క్రోమియం, కాడ్మియం వంటి విషపూరిత లోహాలు శరరీంలోకి వెళ్తాయని తెలిపారు. ఇది శరీరంలోని అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. పేపర్ కప్పులు హైడ్రోఫోబిక్ ఫిల్మ్ సన్నటి పొరతో తయారవుతాయని వివరించారు. ఇందులోనూ పాలీ ఇథలీన్ ఉంటుందని చెప్పారు. ఇక ఈ గ్లాసులలో టీనే కాకుండా ఇతర ఏ వేడి పదార్ధాలు తీసుకున్న ప్రమాదమే అని హెచ్చరించారు.