డ్రగ్స్ పరీక్షల్లో దొరికిపోతానని మూత్రంలో నీటిని కలిపిన హీరోయిన్

డ్రగ్స్ దందా దేశ వ్యాప్తంగా కలకలం సృష్టిస్తుంది.. ఈ కేసులో సినిమా వాళ్లతోపాటు రాజకీయ నాయకులు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే కన్నడ సినీ పరిశ్రమకు కూడా డ్రగ్స్ సెగ తగిలింది. ఇప్పటికే కన్నడ పరిశ్రమకు చెందిన హీరోయిన్లు సంజన, రాగిణి ద్వివేదిలను సెంట్రల్ క్రైమ్ బ్రాంబ్ అరెస్ట్ చేసి, విచారిస్తోంది. టెస్టింగ్ నిమిత్తం వీరిని బెంగళూరులోని కేపీ జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, డోప్ టెస్ట్ కోసం ఇచ్చిన యూరిన్ శాంపిల్ విషయంలో రాగిణి చీటింగ్ చేసినట్టు తెలుస్తోంది. తన యూరిన్ లో కొంత నీటిని ఆమె మిక్స్ చేసినట్టు డాక్టర్లు గుర్తించారు.

దీంతో, మరోసారి ఆమె వద్ద నుంచి శాంపిల్ తీసుకుని పంపినట్టు సమాచారం. అయితే ఈ వ్యవహారంలో టాలీవుడ్ కు చెందిన కొందరు ప్రముఖులు, రాజకీయ నేతలు ఉన్నట్లుగా సమాచారం.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి