దుబ్బాక ఓటమిపై స్పందించిన హరీష్ రావు

దుబ్బాక ఓటమిపై స్పందించిన హరీష్ రావు

దుబ్బాక నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ ఓటమికి పూర్తి బాధ్యత నాదే అన్నారు మంత్రి హరీశ్ రావు. ప్రజలు ఇచ్చిన తీర్పున శిరసా వహిస్తామని.. ఓటమికి కారణాలు పూర్తి స్థాయిలో సమీక్షించుకుంటామని, లోపాలను సరిచేసుకుంటామని వివరించారు.

పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు చెప్పిన ఆయన.. ఓడిపోయినప్పటికీ ప్రజాసేవకే అంకితమవుతామని, ప్రజలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతామన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత తరపున అన్నీ తానై దుబ్బాకలో ప్రచారం చేశారు. కీలకమైన నేతలు అందరూ దుబ్బాకలో హరీశ్ రావు తరపున నిలబడి పోరాడారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి