తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ఏడుగురు దుర్మరణం

తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ఏడుగురు దుర్మరణం

తూర్పు గోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున గోకవరంలో ఓ పెళ్లి వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందారు. రాజానగరం మండలం వెలుగుబందా చెందిన అమ్మాయికి , గోకవరం మండలం ఠాకూర్‌పాలెంకు చెందిన అబ్బాయికి గురువారం రాత్రి తంటికొండ కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వివాహం జరిగింది.

ఈ వివాహ వేడుకకు ముగించుకొని వధూవరుల కుటుంబసభ్యులు, బంధువులు దాదాపు 30 మంది వరకు వ్యానులో కొండపై నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో బ్రేకులు ఫెయిల్‌ కావడంతో వ్యాను మెట్ల మార్గం ద్వారా కొండ కిందకు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు చనిపోగా… పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని రాజమండ్రిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి