నోటీసు అందుకున్న చంద్రబాబు – విచారణకు వస్తానని హామీ

cid notice to chandrbabu naidu

అమరావతి భూముల కేసులో నారా చంద్రబాబు నాయుడుకి ఏపీ సీఐడీ పోలీసులు నోటీసులు ఇవ్వడానికి హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే సీఐడీ పోలీసులు ఇచ్చిన నోటీసులు 41CRPC/A కాబట్టి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం అనేది జరుగదు.

నోటీసులు సైతం కోర్ట్ ద్వారా వస్తాయి కాబట్టి చంద్రబాబు విచారణకు హాజరు కావాల్సి వస్తుంది, విచారణకు హాజరుకాకపోయిన లేక విచారణ అనంతరం దోషిగా తేలితే మాత్రమే చంద్రబాబును అరెస్ట్ చేస్తారు. ఒక వేళ చంద్రబాబు నాయుడు విచారణకు సహకరించకపోయిన అరెస్ట్ చేసే అధికారం పోలీసులకు ఉంటుంది.

నోటీసు అందుకున్న చంద్రబాబు – విచారణకు వస్తానని హామీ

ఇలాంటి అంశాల మీద చంద్రబాబుకు పూర్తి అవగాహాన ఉన్న నేపథ్యంలో ఏపీ సీఐడి అధికారులు ఇచ్చిన నోటీసులు చంద్రబాబు నాయుడు స్వీకరించి ఈ నెల 23న జరగనున్న విచారణకు హాజరు అవుతానని హామీ ఇచ్చారు. సీఐడీ అధికారులు ఇచ్చిన నోటీసు అందుకోని, తనకు నోటీసు అందినట్టు సంతంకం సైతం చేశారు చంద్రబాబు. లాయర్లు ఇచ్చిన సలహా ప్రకారం ప్రస్తుతానికి నోటీసులు అందుకున్న చంద్రబాబు నాయుడు, ఈ నెల 23న జరగనున్న విచారణకు హాజరవుతారా లేక ఏదైనా కారణం చెప్పి కోర్టు నుండి విచారణకు హాజరుకాకుండా స్టే తెచ్చుకుంటారా అనేది వేచి చూడాలి.

చంద్రబాబు నాయుడు నోటీసులు అందుకోని సంతం చేసిన డాక్యుమెంట్లు ఇవే…

మీ అభిప్రాయం కామెంట్ చేయండి