గూగుల్ పే చేస్తే డబ్బులు కట్ అవుతాయా – ఇందులో నిజం ఎంత

గూగుల్ పే చేస్తే డబ్బులు కట్ అవుతాయా - ఇందులో నిజం ఎంత : జనవరి నుంచి డబ్బు పంపించడానికి లేదా స్వీకరించడానికి ప్రస్తుతం ఉన్న pay.google.com ను ఉపయోగించలేరని..

ఆన్‌లైన్‌ మనీ ట్రాన్స్‌ఫర్ ప్లాట్‌ఫామ్‌.. గూగుల్‌ పే కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చిందని.. వచ్చే ఏడాది జనవరి నుంచి డబ్బులు ఖాతా నుంచి పంపించాలంటే చార్జీలు వసూలు చేస్తారని కథనాలు వస్తున్నాయి. త్వరలోనే గూగుల్‌ ఈ సేవలను నిలిపేస్తుందనే ప్రచారం జరిగింది. దీనిపై గూగుల్‌ పే.. అధికారికంగా ఓ ప్రకటన చేసింది. రెండు రోజులుగా జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చింది.

ఇప్పటివరకు డబ్బు బదిలీపై యూజర్ల నుంచి గూగుల్‌ పే ఎలాంటి చార్జీలు వసూలు చేయలేదు. ఐఓఎస్‌ యూజర్లకు కూడా ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తూ.. గూగుల్‌ పే యాప్‌ను సరికొత్తగా తీర్చిదిద్దారు. దీంతో పాటే.. 2021 జనవరి నుంచి డబ్బు పంపించడానికి లేదా స్వీకరించడానికి ప్రస్తుతం ఉన్న pay.google.com ను ఉపయోగించలేరని.. ఇందుకోసం కొత్త పే యాప్‌ను ఉపయోగించాలని.. అమెరికా ప్రజలకు సమాచారం అందించింది. అలాగే తక్షణ నగదు బదిలీల కోసం చార్జీలు వసూలు చేస్తామని.. స్పష్టం చేసింది. దీంతో గూగుల్ పే యూజర్లకు షాక్ అంటూ.. పెద్ద ఎత్తున కథనాలు వెలువడ్డాయి.

దీనిపై గూగుల్‌ క్లారిటీ ఇస్తూ.. ఈ ప్రకటన కేవలం అమెరికా దేశానికి మాత్రమే పరిమితమని.. ఇండియా యూజర్లకు కాదని స్పష్టం చేసింది. ఇదివరకటిలా యాప్‌ను ఉపయోగించుకోవచ్చని ప్రకటించింది.

భారత్‌లో తమకు ఏడు కోట్ల మంది యూజర్లున్నారని.. పేమెంట్ వాల్యూ 110 బిలియన్‌ డాలర్లు అని.. తెలిపింది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు