ప్లాస్టిక్ నదులు: ప్రపంచంలోని మొదటి ఐదు ప్లాస్టిక్-కలుషిత నదులు

ప్రపంచంలోని అనేక నదులు మనుషులు వదిలే ప్లాస్టిక్ వ్యర్థాలను తమతో పాటు తీసుకువెళ్లి సముద్రాల్లో కలుపుతున్నాయి. అత్యధిక స్థాయిలో ప్లాస్టిక్ వ్యర్థాలను సముద్రాల్లోకి వదిలే నదుల్లో ముఖ్యంగా ఐదు నదులు ప్రతి రోజు దాదాపు 1,652 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను సముద్రంలోకి నెడుతున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలను సముద్రంలోకి వదిలే ఆ టాప్ 5 నదులు ఏవో చూద్దాం.

అయితే 1,652 టన్నులు అంటే ఎంత ఉంటుంది ? ఒక టన్ను ఎంత ఉంటుంది? ఉదాహరణకు ఒక ఆసియా జాతికి చెందిన మగ ఏనుగు. సగటున నాలుగు టన్నుల బరువు ఉంటుంది.దీన్నీ బట్టి ప్రతి 24 గంటలకు,ఈ ఐదు నదులు కలిసి 413 ఏనుగుల బరువుతో సమానంగా వున్నా అంత ప్లాస్టిక్‌ను ప్రపంచ మహాసముద్రాలలోకి నెట్టివేస్తున్నాయి.

యాంగ్జీ నది : ప్రపంచంలో అత్యంత ప్లాస్టిక్-కలుషిత నది యాంగ్జీ. ఇది ప్రపంచంలో మూడవ పొడవైన నది,చైనా జనాభాలో దాదాపు మూడింట ఒక వంతు యాంగ్జీ బేసిన్ పరిధిలో నివసిస్తుంది మరియు చైనా జిడిపిలో 20% దాని డెల్టా వెంట పరిశ్రమల నుండి ఉత్పత్తి అవుతుంది.ఈ నది ద్వారా రోజుకి 912 టన్నుల ప్లాస్టి తూర్పు చైనా సముద్రంలో కలుస్తుంది. ఇది 228 మగ ఆసియా ఏనుగులకు సమానం.సంవత్సరంలో ఈ నది వల్ల దాదాపు 3 లక్షల 33 వేల టన్నుల ప్లాస్టిక్ సముద్రంలో కలుస్తుంది .

గంగా నది: ప్లాస్టిక్ కలుషిత నదులలో గంగా నది రెండవది. ఇది భారతదేశం మరియు బంగ్లాదేశ్ గుండా ప్రవహిస్తుంది,దాని ఒడ్డున నివసిస్తున్న లక్షలాది మందికి ఈ నది జీవనాడి.ఈ నది ద్వారా రోజుకి 315 టన్నుల ప్లాస్టిక్ బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇది 79 మగ ఆసియా ఏనుగులకు సమానం.సంవత్సరంలో ఈ నది వల్ల దాదాపు 1 లక్ష 13 వేల టన్నుల ప్లాస్టిక్ సముద్రంలో కలుస్తుంది.

జి నది : జి నది, లేదా సి-కియాంగ్, ఆగ్నేయ చైనాలోని పెర్ల్ నది యొక్క ఉపనది. ఈ నదిని ఒక ప్రధాన వాణిజ్య జలమార్గముగా వాడుతారు ,ఇది చైనా లోపలి భాగాన్ని పారిశ్రామిక డెల్టాతో కలుపుతుంది.ఈ నది ద్వారా రోజుకి 202 టన్నుల ప్లాస్టిక్ దక్షిణ చైనా సముద్రంలో కలుస్తుంది.ఇది 51 మగ ఆసియా ఏనుగులకు సమానం.సంవత్సరంలో ఈ నది వల్ల దాదాపు 74 వేల టన్నుల ప్లాస్టిక్ సముద్రంలో కలుస్తుంది.

హువాంగ్‌పు నది :బాగా వాణిజ్య మరియు పారిశ్రామిక వృద్ధి వున్నా ప్రాంతం ద్వారా ప్రవహిస్తుంది..ఈ నది ద్వారా రోజుకి 112 టన్నుల ప్లాస్టిక్ యెల్లో సముద్రంలో కలుస్తుంది .ఈ మొత్తం సుమారు 28 మగ ఆసియా ఏనుగులకు సమానం.సంవత్సరంలో ఈ నది వల్ల దాదాపు 41 వేల టన్నుల ప్లాస్టిక్ సముద్రంలో కలుస్తుంది.

క్రాస్ నది : చిన్న నది అయ్యినప్పటికీ దాని బేసిన్ లో అధిక వర్షపాతం నమోదు అవుతుంది. నైజీరియాలో ప్రవహించే ఈ నది ద్వారా రోజుకి 110 టన్నుల ప్లాస్టిక్ గినియా గల్ఫ్ ద్వారా సముద్రంలో కలుస్తుంది .ఈ మొత్తం సుమారు 27 మగ ఆసియా ఏనుగులకు సమానం.సంవత్సరంలో ఈ నది వల్ల దాదాపు 40 వేల టన్నుల ప్లాస్టిక్ సముద్రంలో కలుస్తుంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు