తెలుగు రాష్ట్రాల్లో భారీ ఆర్ధిక మోసాలు.. అమాయకులే లక్ష్యంగా రెచ్చిపోతున్న

అమాయకులను లక్షంగా చేసుకొని అందినకాడికి దోచుకుంటున్నారు కొందరు మాయగాళ్లు. ప్రజల బలహీనతనే పునాది చేసుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.కోట్లు వసూలు చేస్తున్నారు. బిట్ కాయిన్స్, టప్పర్ వెర్, క్యూనెట్ వంటి పేర్లు పెట్టి ప్రజలను దారుణంగా మోసం చేస్తున్నారు. తాజాగా బిట్ కాయిన్స్ పేరుతొ గోదావరిఖని ప్రాంతాల్లో 58 కోట్ల మోసం జరిగింది. ఇక నల్గొండ జిల్లాలో టప్పర్ వేర్ బిసినెస్ పేరుతొ 4 కోట్ల మోసం జరిగిది.. ఇక్కడ మోసపోతున్నవారందరు పేదవారే అత్యాశకు పోయి అప్పులు తెచ్చి మరి పెట్టుబడులు పెడుతున్నారు. లక్ష ఇస్తే నెలకు 30 వేలు ఇస్తామని ఒకరు. వెయ్యి ఇస్తే నెలకు రెండు వేలు ఇస్తామని మరొకరు.. ఇలా భారీ మోసాలు జరుగుతున్నాయి.

ఇక తాజాగా నెల్లూరు జిల్లాలో మరో మోసం జరిగింది. ఆన్‌లైన్‌లో రూ.కోట్లు వసూలు చేసిన ముఠాను నెల్లూరు పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వారి నుంచి రూ.1.29 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరులో బుధవారం విలేకరుల సమావేశంలో ఎస్పీ భాస్కర్‌భూషణ్‌ ఈ కేసు వివరాలు వెల్లడించారు. యర్రగొల్ల మైఖెల్‌ సుమన్‌, ఏటూరి రవికుమార్‌, దండగల యల్లా శ్రీను నెల్లూరులో వెల్‌ పే ట్రేడర్స్‌ కంపెనీని స్థాపించారు. ఒక ఖాతాదారుడు రూ.10వేలు డిపాజిట్‌ చేసిన మరుసటి రోజు నుంచే రోజుకు రూ.200 చొప్పున 100 పని దినాల్లో రూ.20వేలు ఆన్‌లైన్‌లో వారి బ్యాంకు ఖాతాలకు జమ చేస్తామని నమ్మబలికారు.

ఏడు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా 12,600 మంది నుంచి రూ.84 కోట్లకుపైగా డిపాజిట్‌ చేయించారు. అయితే దీనిపై కొందరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ నెల 2 న నెల్లూరు లోని దర్గామిట్ట పోలీస్ లు కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ నాగేశ్వరమ్మ కేసును టేకాఫ్ చేసి నిందితులను పట్టుకున్నారు. బుజబుజనెల్లూరు వద్ద సుమన్‌తోపాటు రవికుమార్‌, శ్రీనులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.1.29 కోట్ల నగదు, రెండు కార్లు, ఐదు ల్యాప్‌టా్‌పలు స్వాధీనం చేసుకున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి