కండోమ్ కు చిల్లుపెట్టిన ప్రియుడికి జైలు శిక్ష వేసిన కోర్టు..

లివింగ్ రిలేషన్ షిప్ లో ఉంటూ శారీరకంగా దగ్గరవుతున్న జంట వార్తల్లోకి ఎక్కారు. లండన్ కు చెందిన 47 ఏండ్ల వ్యక్తి 38 ఏండ్ల మహిళతో కలిసి సహజీవనం చేస్తున్నాడు. వీరిద్దరి మధ్య అగ్రిమెంట్ ప్రకారం ప్రియురాలితో శారీరకంగా కలిసినప్పుడు తప్పనిసరిగా కండోమ్ పెట్టుకోవాలి. వీరి అగ్రిమెంట్ ప్రకారమే రెండేళ్ల పాటు సదరు వ్యక్తి కండోమ్ వాడాడు.. అనారోగ్య సమస్యతో ప్రియురాలు ఆసుపత్రికి వెళ్లగా ఆమె ప్రెగ్నెంట్ అని తెలిసింది.

దింతో ఇంటికి వచ్చి వాడిపడేసిన కండోమ్స్ పరిశీలించింది.. కండోమ్స్ కి రంద్రాలు ఉండటం.. పక్కెనే సూది దొరకడంతో తన ప్రియుడు మోసం చేశాడని గ్రహించింది.. దింతో అతడిపై కేసు పెట్టింది.. కాగా ఈ కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.. ప్రియుడికి నాలుగేళ్ళ శిక్ష వేస్తూ తీర్పు ఇచ్చింది. నమ్మకద్రోహం చేశాడని తీర్పులో పేర్కొంది.. నమ్మకంతో ఏర్పడిన వీరి బంధంలో నమ్మకద్రోహాన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తున్నట్లు పేర్కొంది కోర్టు.. కాగా ప్రస్తుతం ప్రియుడు జైలుకు వెళ్ళాడు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి