దేశంపై ఎంత ద్వేషం ఉంటేమాత్రం.. మరి ఇంత నీచానికి దిగజారతారా?

భారత్‌-చైనా సరిహద్దుల్లో యుద్దవాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వేలాది మంది భారతీయ సైనికులు సిక్‌లీవులపై వెళుతున్నారని పేర్కొంటూ, సామాజిక మాధ్యమాల్లో కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారు. చైనా సైన్యంతో పోరాడలేక లీవ్ కోసం అప్లై చేస్తున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పీఐబీ) తమ అధికారిక ట్విట్టర్ లో పేర్కొంది. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ఈ వార్తలు అవాస్తవమని తెలిపింది. అందులో నిజం లేదని తెలిపింది. మన సైనికులు సెలవుకు దరఖాస్తు చేయలేదని సైనిక వర్గాలు కూడా తెలిపాయి.

ఇక ఇటువంటి అసత్య ప్రచారాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు అధికారులు. ఇక ఈ ట్వీట్స్ పై కేసు నమోదు చేసిన అధికారులు విచారణ చేపట్టారు. నిందితులను త్వరలోనే అదుపులోకి తీసుకునే అవకాశం కనిపిస్తుంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి