ఫోర్బ్స్ లిస్ట్ లో సత్తాచాటిన భారతదేశ మహిళలు, జాబితాలో నిర్మలా సీతారామన్..‌

మన ఆర్ధిక మంత్రి అయిన నిర్మలా సీతారామన్ 41వ స్థానంలో చోటు దక్కించుకున్నారు.. ఆమె తో పాటు హెచ్‌సీఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, కార్పొరేషన్ సీఈఓ రోషిణీ నాడార్ మల్హోత్రా, మరియు బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్‌షా వంటి బిజినెస్ పెర్సనాలిటీస్ స్థానం సంపాదించుకున్నారు.

ఫోర్బ్స్ లిస్ట్ లో సత్తాచాటిన భారతదేశ మహిళలు, జాబితాలో నిర్మలా సీతారామన్..‌

ప్రతి సంవత్సరం లాగానే, ఈ సంవత్సరం కూడా ప్రపంచంలో 100 అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. తాజా లిస్ట్ లో మన భారత మహిళలు ఎప్పటిలానే సత్తాచాటారనే చెప్పాలి. ఇందులో మన ఆర్ధిక మంత్రి అయిన నిర్మలా సీతారామన్ 41వ స్థానంలో చోటు దక్కించుకున్నారు.. ఆమె తో పాటు హెచ్‌సీఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, కార్పొరేషన్ సీఈఓ రోషిణీ నాడార్ మల్హోత్రా, మరియు బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్‌షా వంటి బిజినెస్ పెర్సనాలిటీస్ స్థానం సంపాదించుకున్నారు.

ఏంజెలా మెర్కెల్‌, జర్మనీకి చెందిన ఛాన్సలర్ ఎప్పటిలాగానే తన మొదటి ప్లేస్ ని ఆక్రమించుకున్నారు. ఏంజెలా వరుసగా గత తొమ్మిది సంవత్సరాలుగా ప్రథమ స్థానంలో కొనసాగించి, ఇపుడు పదోవ సంవత్సరంలో కూడా ఫస్ట్ ప్లేస్ లో నిలవడం విశేషం.అలాగే వరుసగా రెండో స్థానాన్ని యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ హెడ్‌ క్రిస్టిన్ లగార్డ్ నిలవగా.. ప్రస్తుత అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్ మొట్ట మొదటిసారిగా అది కూడా మూడో స్థానంలో పేరు సంపాదించుకున్నారు.

ఈసారి శక్తివంతమైన మహిళల లిస్ట్ లో 38 మంది సీఈఓలు, 10 మంది దేశాధినేతలు, ఐదుగురు ఎంటర్‌టైనర్లు చోటు దక్కించుకోగా.. వీరందరి వయసు, ఉద్యోగ రీత్యా వేరువేరు అయినప్పటికీ 2020 లో ఎదురైనా సమస్యలను పరిష్కరించడంలో తమ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించుకుని ఆకట్టుకోవడంతో జాబితాలో ఉన్నారని ఫోర్బ్స్ వివరించింది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు