టీవీ సీరియల్ డైరెక్టర్ క్రియేటివిటీకి డాక్టర్లు షాక్.. టాయ్ లెట్ క్లీనర్ బ్రెష్ తో అద్భుతాన్ని చేశాడు..

bengal doctor creativity

టీవీ సీరియల్.. ఏ భాషలో ఉన్నా క్రియేటివిటీ పీక్ లో ఉంటుంది.. సెంటిమెంట్ అనే ఆయుధంతో ప్రజలను కట్టిపడేస్తున్నారు. సినిమాలకు రాని రేటింగ్.. డబ్బులను సంపాదిస్తుంది. ఈ క్రమంలోనే రోజురోజుకు టీవీ సీరియల్స్ డైరెక్టర్ల క్రియేటివిటీ ఊహకు అందని విధంగా ఉండటమే కాకుండా.. లేటెస్ట్ గా వైద్య రంగాన్ని సైతం విస్మయానికి గురి చేసింది.

zee bangla.. జీ బంగ్లా ఛానల్ లో ఓ సీరియల్ టెలికాస్ట్ అవుతుంది. అందులో ఆస్పత్రి సీన్. పేషెంట్ సీరియస్ కండీషన్.. హార్ట్ ప్రాబ్లమ్.. అతనికి కరెంట్ స్ట్రోక్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే డైరెక్టర్ తన తెలివితేటలకు విశేషంగా ఉపయోగించాడు.

హార్ట్ స్ట్రోక్స్ ఇచ్చే మోడల్ లో ఉన్న.. బాత్ రూం క్లీనర్స్ ను ఉపయోగించాడు. బాత్ రూం క్లీనింగ్ చేసే బ్రేష్ లను ఉపయోగిస్తూ.. డాక్టర్లు ట్రీట్ మెంట్ ఇస్తూ ఉంటారు. డైరెక్టర్ కంటే మరింత తెలివిమీరిన ఆడియన్స్.. దాన్ని ఇట్టే పసిగట్టేశారు. ఇంకేముందీ.. జీ బంగ్లా సీరియల్ లోని సీన్ తో ట్విట్టర్ లో రెచ్చిపోయారు.

లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేసే డాక్టర్లకు ఈ ట్రీట్ మెంట్ ఇప్పటి వరకు తెలియకపోవటం వింత అంటూ కామెడీ చేస్తున్నారు నెటిజన్లు. బాత్ రూం క్లీనింగ్ బ్రెష్ తో.. ఓ హార్ట్ పేషెంట్ ను బతికించొచ్చు అన్న కామన్ పాయింట్ మిగతా డైరెక్టర్లు ఎలా మిస్ అయ్యారు అంటూ సెటైర్లు వేస్తున్నారు.

ఎవరి వెర్షన్ ఎలా ఉన్నా.. ఆ సమయానికి బాత్ రూం క్లీనింగ్ బ్రెష్ లను ఇలా కూడా వాడొచ్చు అని నిరూపించిన ఆ డైరెక్టర్ క్రియేటివిటీకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు