బైరెడ్డి సిద్దార్థరెడ్డిపై కన్నేసిన బీజేపీ.. త్వరలో కలిసే అవకాశం.

భారతీయ జనతా పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో బలపడేందుకు తీవ్రప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే పలువురు నేతలను తమ పార్టీలోకి ఆహ్వానిస్తుంది. వీరిలో అధికార పార్టీకి చెందినవారితోపాటు, ప్రతిపక్షాలకు చెందిన కొందరు నేతలు ఉన్నారు. రెండు మూడు నెలల్లో బడానేతలు బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.

ఇక తెలంగాణలో గతంతో పోల్చుకుంటే బీజేపీ పుంజుకుంది. ఎవరు ఊహించని విధంగా విజయాలు సాధిస్తుంది. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో అధికార పార్టీకి గట్టి షాక్ ఇచ్చింది. ఇక నాగార్జున సాగర్ ఉప ఎన్నికపై కన్నేసింది. గ్రాడ్యుయేషన్ ఎన్నికలు కూడా ఉండటంతో పార్టీలో బలమైన నేత కోసం వెతుకుతుంది బీజేపీ.

మరోవైపు కరీంనగర్ జిల్లాలు చెందిన పలువురు నేతలు బీజేపీలో చేరే అవకాశం కనిపిస్తుంది. సిరిసిల్ల నుంచి కేకే మహేందర్ రెడ్డి. కరీంనగర్ నుంచి మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అనుచరులు త్వరలో బీజేపీలో చేరుతారని వార్తలు వస్తున్నాయి.

ఇక ఆంధ్ర విషయానికి వస్తే, టీడీపీ నుంచి బీజేపీలోకి వలసలు భారీగానే పెరిగాయి. పార్టీ గతంలో కంటే ఇప్పుడు మెరుగ్గా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే బడా నేతలు, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వారిని పార్టీలోకి చేర్చుకునేందుకు సిద్ధమయ్యారు బీజేపీ నేతలు.

ఈ క్రమంలోనే బైరెడ్డి సిద్దార్థరెడ్డి పేరు తెరపైకి వచ్చినట్లుగా బీజేపీకి చెందిన ఓ కీలక నేత తెలిపారు. ఇప్పటికే ఆయన పెదనాన్న, బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సిద్దార్థరెడ్డి సోదరి శబరీ, బీజేపీలో యాక్టీవ్ గా ఉన్నారు. ఇక ఫ్యాన్ ఫాలోయింగ్ అధికంగా కలిగిన సిద్దార్థరెడ్డిని పార్టీలోకి తీసుకొస్తే, ఆయన భవిష్యత్ తో పాటు పార్టీ భవిష్యత్ కూడా బాగుంటుంది అని బీజేపీ నేతలు భావిస్తున్నారట..

కర్నూలు జిల్లాలో మంచి పట్టున్న కుటుంబం కావడం, ఇప్పటికే పెదనాన పార్టీలో ఉండటంతో బైరెడ్డి సిద్దార్థరెడ్డిని త్వరలో బీజేపీ పెద్దలు కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక తాజాగా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కర్నూలు జిల్లా పర్యటనకు వెళ్ళినప్పుడు సిద్దార్థరెడ్డి పేరు తెరపైకి వచ్చిందట. సిద్దార్థరెడ్డి పార్టీలోకి వస్తే రాయలసీమలో పార్టీ బలం పెరుగుతుందని కమలం నేతలు భావిస్తున్నారట. ఇక జాతీయ పార్టీలో ఉంటే సిద్దార్థరెడ్డికి మంచి అవకాశాలు ఉంటాయని బీజేపీ వర్గాల్లో చర్చ నడుస్తుంది.

ఒక వేళ బీజేపీ నేతలు సిద్దార్థరెడ్డిని కలిసి, చర్చలు ఫలిస్తే, ఆ పార్టీకి మరింత బలం చేకూరినట్లు అవుతుంది.

బైరెడ్డి సిద్దార్థరెడ్డిపై కన్నేసిన బీజేపీ.. త్వరలో కలిసే అవకాశం.

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు