రేపటి నుండే కరోనా వ్యాక్సిన్ పంపిణీ – నాలుగు రాష్ట్రాల్లో మొదలుకానున్న వ్యాక్సినేషన్

corona vaccine in india

దేశవ్యాప్తంగా మొదటి దశలో కనీసం కోటి మంది ఫ్రంట్ లైన్ వర్కర్లకు కరోనా వ్యాక్సిన్ వేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసింది. కరోనా వ్యాక్సిన్ ఇచ్చేందుకు మొదటి దశలో ఏపీతో సహా మరో మూడు రాష్ట్రాలను కేంద్రప్రభుత్వం ఎంపిక చేసింది. గుజరాత్ , పంజాబ్ , అస్సాం రాష్ట్రాలు సైతం ఈ జాబితాలో ఉన్నాయి. రేపటి నుండి మూడు రోజుల పాటు అంటే డిసెంబర్ 27 నుండి డిసెంబర్ 29 వరకు వ్యాక్సినేషన్ కార్యక్రమం జరగనుంది.

వేగంగా వ్యాక్సినేషన్ ఏర్పాట్లు – మొదట కృష్ణా జిల్లాలో డ్రైరన్ 

ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం అధికారులు కృష్ణాజిల్లాను ఎంపిక చేశారు. మొత్తం 7 లక్షల మంది ఫ్రంట్ లైన్ వర్కర్లతో పాటు 3.6 లక్షల ప్రభుత్వ ఆరోగ్య కార్యకర్తలకు మొదట ఈ వ్యాక్సిన్ ఇచ్చేందుకు దాదాపు 90 వేల మంది సిబ్బందికి అధికారులు శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపతి , తాడిగడప పాఠశాల, ఉప్పులూరు  పీహెచ్‌సీ, విజయవాడ పూర్ణ ప్రైవేట్‌ ఆస్పత్రి, ప్రకాష్‌నగర్‌ అర్బన్‌ పీహెచ్‌సీ ల్లో డ్రైరన్‌కు ఏర్పాట్లు చేసినట్టు అధికారులు ప్రకటించారు.

ఆదివారం నాడు అన్ని కేంద్రాల్లో ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షించనున్నారు. వ్యాక్సిన్ ను 3 – 5 డిగ్రీల వద్ద నిల్వ ఉంచేందుకు కోల్డ్ బాక్సులతో పాటు 29 రిఫ్రిజరేషన్ వాహానాలను అధికారులు సిద్ధంగా ఉంచారు. అచ్చు పోలింగ్ కేంద్రాల్లో మాదిరిగానే ఈ ఏర్పాట్లు ఉంటాయని అధికారులు ప్రకటించారు.

మొత్తానికి ఎంతో కాలం నుండి ఎదురుచూస్తున్న కోవిడ్ టీకా ఇండియాలో తొలిదశలో గుజరాత్, ఆంధ్రప్రదేశ్ , పంజాబ్ , అస్సాం రాష్ట్రాల్లో మొదలు కానుండటంతో ఏం జరుగుతుందో అని ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు