మన 14 ఏళ్ల హిస్టరీని రిలీజ్ చేద్దాం – వెంటనే లేఖ తయారు చేయాలని చంద్రబాబు ఆదేశం – ఆ ముగ్గురితో కమిటీ ఏర్పాటు

  మన 14 ఏళ్ల హిస్టరీని రిలీజ్ చేద్దాం - వెంటనే లేఖ తయారు చేయాలని చంద్రబాబు ఆదేశం - ఆ ముగ్గురితో కమిటీ ఏర్పాటు

  కేవలం 22 నెలల పాలనపైనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాలుగు పేజీల లేఖ విడుదల చేసింది.. అదే మేనిఫెస్టోగా తిరుపతి ఎన్నికల్లో ఇంటింటికీ కరపత్రంగా పంచిపెడుతుంది. ఈ క్రమంలోనే.. తెలుగుదేశం పార్టీ సైతం సరికొత్త ఆలోచనకు తెర తీసింది. ఏప్రిల్ 8వ తేదీ రాత్రి తిరుపతిలో బస చేసిన చంద్రబాబు.. ఓ ఐడియాను నేతల దగ్గర ప్రస్తావించారు.

  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 22 నెలల పాలనపై విడుదల చేసిన లేఖకు పోటీగా.. 14 ఏళ్ల చంద్రబాబు పాలన తీరు, ప్రయోజనాలు, లబ్ధిపొందిన ప్రజలు, టీడీపీ పథకాలు, ప్రతి ఇంట అందిన లబ్ధి వివరాలతో లేఖ విడుదల చేయాలని నేతలకు సూచించారంట.

  తెలుగు రాష్ట్రాలకు ప్రపంచంలోనే గుర్తింపు తీసుకొచ్చిన విధానం.. ఐటీ రంగంలో చంద్రబాబు చేసిన కృషి.. విద్యుత్ వినియోగంలో దేశంలోనే నెంబర్ స్థాయికి తీసుకెళ్లిన తీరు.. విద్య, వైద్యం, వ్యవసాయంలో చంద్రబాబు హయాంలో జరిగిన ప్రగతిని వివరిస్తూ ఈ లేఖ ఉండాలని నేతలకు స్పస్టం చేశారంట చంద్రబాబు.

  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ డబ్బును పప్పు బెల్లాల్లా పంచిపెడుతుందని.. ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులను నిర్వీర్యం చేస్తుందని.. ఉచితంగా డబ్బు ఇవ్వటం వల్ల ప్రజలు సోమరిపోతుల్లా తయారవుతారని.. ఇది మంచి పద్దతి కాదని.. వాళ్ల కాళ్లపై వాళ్లు నిలబడే విధంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని.. టీడీపీ ప్రభుత్వంలో అదే జరిగిందని.. దీన్ని ప్రజల్లో తీసుకెళ్లాలని సూచించారంట.

  తిరుపతి ఉప ఎన్నిక ఏప్రిల్ 17వ తేదీ జరగనుంది.. వెంటనే లేఖ పనులు మొదలుపెట్టండి.. ఏప్రిల్ 12వ తేదీ నుంచి అన్ని నియోజకవర్గాల్లోని ప్రతి ఇంటికి టీడీపీ వెలుగు పేరుతో అందించాలని ఆదేశించారంట అధినేత చంద్రబాబు. ఇప్పటికే దీనిపై పెద్ద ఎత్తున కసరత్తు మొదలుపెట్టారు నేతలు.

  ఈ లేఖ తయారీ బాధ్యతలను మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, వర్ల రామయ్య, దేవినేని ఉమ ఆధ్వర్యంలో తయారు చేయటానికి సిద్ధం అయ్యారు.

  మీ అభిప్రాయం కామెంట్ చేయండి

  మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు