పిల్ల పూ.. మాటలు మాట్లాడొద్దు లోకేష్ : లైవ్ లో బండ భూతులు తిట్టిన పెద్దారెడ్డి

peddi reddy ramachandra reddy

విమర్శలు, ఆరోపణలు చేసేటప్పుడు ఓ స్థాయి ఉంటుంది.. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నామో జ్ణానం ఉండాలి.. ఏది పడితే అది.. ఎలా పడితే అలా.. మాట్లాడితే చెమడాలు వలుస్తాం.. ఈ వార్నింగ్ ఇచ్చింది చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితే.. ఎవరికి ఇచ్చారో తెలుసా నారా లోకేష్ కు.

పుంగ‌నూరు వీర‌ప్ప‌న్ పెద్దిరెడ్డి.. ఎర్ర‌చంద‌నం చెట్ల‌ను న‌రికేస్తున్న‌ట్టే! ప్ర‌జాస్వామ్యాన్నీ ఖూనీ చేస్తున్నాడు. తిరుపతి పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గానికి బ‌య‌టి నుంచి త‌న ముఠాల‌ను తీసుకొచ్చి పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేయిస్తున్నాడు అంటూ మంత్రి పెద్దిరెడ్డిని ఉద్దేశించి ట్విట్ చేశాడు లోకేష్.

ఈ ట్విట్ చూసిన మంత్రి పెద్దిరెడ్డి చాలా సీరియస్ అయ్యారు. ఎవరు ఎర్ర చందనం స్మగ్లింగ్ చేశారో నీ అయ్య చంద్రబాబుకు ఇంకా బాగా తెలుసు.. అంతర్జాతీయ ఎర్ర చందనం స్మిగ్లింగ్ సూత్రధారికి పిలిచి టికెట్ ఇచ్చిన చరిత్ర టీడీపీకి ఉంది.. ఆ విషయం మీ నాన్న చంద్రబాబుకు తెలుసు అంటూ కౌంటర్ ఇచ్చారు. పెద్దిరెడ్డి ఎలాంటి వాడో లోకేష్ కు బుద్ధి చెప్పాలంటూ చంద్రబాబుకు సూచించారు.

హైదరాబాద్ లో కూర్చుని ఇష్టమొచ్చినట్లు ట్విట్లు చేస్తుంటే చూస్తూ ఊరుకోం అని.. పిల్ల పూ.. మాటలు మాట్లాడొద్దని.. ఏదైనా ఉంటే.. దమ్ముంటే తిరుపతి, చిత్తూరు వచ్చి మాట్లాడాలని.. పక్క రాష్ట్రంలో కూర్చుని ట్విట్లు వేయటం కాదన్నారు.

ఇప్పటికే చిత్తూరు జిల్లా నుంచి టీడీపీని తరిమికొట్టామని.. ఇలాగే పిల్ల చేష్టలు.. పిల్ల పూ.. మాటలు మాట్లాడితే ఏం చేయాలో మాకు తెలుసు అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మంత్రి పెద్దిరెడ్డి..

ఇటీవల కాలంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టార్గెట్ చేస్తూ.. చాలా సార్లు.. చాలా కామెంట్లు చేశారు నారా లోకేష్. 40 ఏళ్ల ఇండస్ట్రీ చంద్రబాబు కంటే ఎక్కువగానే పెద్దిరెడ్డిపై మాట్లాడుతున్నారు. లేటెస్ట్ గా పుంగ‌నూరు వీర‌ప్ప‌న్ పెద్దిరెడ్డి.. ఎర్ర‌చంద‌నం చెట్ల‌ను న‌రికేస్తున్న‌ట్టే అంటూ కామెంట్ చేయటంపై పెద్దిరెడ్డి చాలా సీరియస్ అయ్యారు. స్థాయి, వ్యక్తిని బట్టి మాటలు ఉండాలన్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు