నీటి వివాదంపై చర్చలకు సీఎం జగన్ సిద్ధం.. సీఎం కేసీఆర్ వస్తారా లేదా..

నీటి వివాదంపై చర్చలకు సీఎం జగన్ సిద్ధం.. సీఎం కేసీఆర్ వస్తారా లేదా..

కృష్ణా – గోదావరి నీటి విషయంలో.. ఏపీ రాయలసీమ ఎత్తిపోతల పథకం.. తెలంగాణ కట్టబోతున్న కొత్త ప్రాజెక్టుల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి వివాదంపై ఏపీ మంత్రి పేర్ని నాని స్పందించారు.

రాయలసీమలో కడుతున్న సీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ విషయంలో వెనక్కి తగ్గేది లేదని చెబుతూనే.. కేటాయించిన నీటి కంటే ఒక్క చుక్క కూడా అదనంగా వాడుకోం అని.. ఇందులో ఎవరికీ ఎలాంటి భయాలు అవసరం లేదన్నారు మంత్రి.

అదే విధంగా ఎగువన ఉన్న తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం – జూరాల మధ్య కడతాం అని చెబుతున్న ప్రాజెక్టులు అక్రమం అని.. కేటాయింపులు లేకుండా ఎలా కడతారని ప్రశ్నించారు.

మాటల యుద్ధాలు.. నీటి యుద్ధాలు అనే భయాందోళనలకు తావు లేకుండా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించుకుని సమస్యను పరిష్కరించుకుంటాయని వివరించారు.

మధ్యవర్తిగా కేంద్ర ప్రభుత్వం, ట్రిబ్యులన్ ఉన్నా పర్వాలేదని.. విషయాన్ని ఎందుకు రాద్దాంతం చేస్తున్నారని ప్రశ్నించారు మంత్రి.

రెండు రాష్ట్రాల సీఎంలు.. కేసీఆర్, జగన్ త్వరలోనే భేటీ అయ్యి చర్చించటానికి సైతం సిద్ధం అని.. ఇందులో భేషజాలకు పోకుండా సామరస్యంగా సమస్యను పరిష్కరిస్తామని వివరించారు మంత్రి. అవసరం అయితే రెండు రాష్ట్రాల సీఎంలు కలిసి కూర్చుని మాట్లాడుకుంటారని స్పష్టం చేశారు. దీనికి ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. కేసీఆర్ సిద్ధంగా ఉన్నారా లేదా అనేది ఆయనే చెప్పాలని మంత్రి పేర్ని నాని చెప్పారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు