సీఎం జగన్ తో పయ్యావుల కేశవ్ భేటీకి ముహూర్తం ఫిక్స్.. సైలెంట్ గానే లోకేష్

సీఎం జగన్ తో పయ్యావుల కేశవ్ భేటీకి ముహూర్తం ఫిక్స్.. సైలెంట్ గానే లోకేష్

సీఎం జగన్ తో పయ్యావుల కేశవ్ భేటీకి ముహూర్తం ఫిక్స్.. సైలెంట్ గానే లోకేష్

తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత.. మంచి లీడర్ అనగానే గుర్తుకొచ్చే వారిలో పయ్యావుల కేశవ్ ఒకరు. అనంతపురం జిల్లాలో పట్టున్న నేత. రెండేళ్లుగా సైలెంట్ గా ఉన్నారు. పార్టీ వ్యవహారాల్లో తలదూర్చి.. సీఎం జగన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పై పెద్ద పెద్ద కామెంట్లు, ఆందోళనలు, నిరసనలు చేయటం ఏమీ లేవు. ఏదో నామ్ కే వాస్తే అన్నట్లు ఉంటున్నారు. ఇది రెండేళ్లుగా జరుగుతూనే ఉంది.

పయ్యావుల కేశవ్ వైఖరి చూసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆయన జోలికి వెళ్లటం లేదు. అసెంబ్లీలో కానీ బయట కానీ పయ్యావులపై విమర్శలు, ఆరోపణలు చేయటం లేదు. అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యేగా ఉన్న పయ్యావులపై వైసీపీ ఎమ్మెల్యేలు ఏ మాత్రం టార్గెట్ చేయటం లేదు. ఎవరి పని వాళ్లు చేసుకుంటూ పోతున్నారు.

రెండేళ్లు అయిపోయింది ఇంకా ఎన్నాళ్లు అనుకున్నారో ఏమో.. సీఎం జగన్ తో భేటీ ఫిక్స్ అయ్యిందనే వార్తలు వస్తున్నాయి. పార్టీ మారే ఆలోచన లేదని చెబుతున్న పయ్యావుల.. నియోజకవర్గం అభివృద్ధి విషయంలో సీఎం జగన్ తో సమావేశం అవుతున్నట్లు చెబుతున్నారంట. కరోనా తగ్గిన తర్వాత.. శ్రావణ మాసంలో సమావేశం కావటానికి రెడీ అయ్యారంట. అంటే ఆగస్ట్ నెలలో జగన్ తో పయ్యావుల భేటీ ఉంటుందని బలమైన టాక్ వినిపిస్తుంది అనంతపురం జిల్లాలో.

పార్టీకి.. పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్న పయ్యావుల కేశవ్ మనసులోని ఆలోచన గుర్తించిన చంద్రబాబు.. ఏ మాత్రం బుజ్జగించటానికి ముందుకు రాలేదంట. ప్రస్తుతం పార్టీ వ్యవహారాలు అన్నీ చూస్తున్న లోకేష్ సైతం.. పయ్యావుల విషయంలో అంటీ ముట్టనట్లు ఉన్నారంట.

పార్టీ మారొద్దని.. పార్టీలోనే ఉండిపోవాలని కోరటం మినహా.. పెద్దగా బలవంతం చేయలేదనే టాక్ వినిపిస్తోంది. మహానాడు జూమ్ మీటింగ్ లోనూ పయ్యావుల కేశవ్ ఏదో మొక్కుబడిగా పాల్గొన్నారని.. ఎలాంటి తీర్మానాలు చేయలేదని.. పొడిపొడిగా మాట్లాడి వెళ్లిపోయారని టీడీపీ నేతలే చెబుతున్నారు.

సీఎం జగన్ తో పయ్యావుల కేశవ్ సమావేశం అవుతున్నారన్న విషయం లీక్ అయిన తర్వాత.. పయ్యావుల డిసైడ్ చేసుకున్న తర్వాత.. ఆగమన్నా ఆగుతారా ఏంటీ అంటున్నారంట లోకేష్. కొత్త రక్తం పార్టీకి ఎక్కిస్తాను.. యువతను లీడర్లను చేస్తానంటున్నారంట లోకేష్.. .

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు