ఆ రెండు పార్టీలకు ఇక సోషల్ మీడియానే దిక్కు

bjp and congress in ghmc elections

తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ఏ వ్యూహంతో GHMC ఎన్నికలను అత్యంత వేగంగా రెప్పపాటులో జరిపే ప్రయత్నం చేస్తున్నారు. దుబ్బాక ఎన్నికల దెబ్బతో సోషల్ మీడియా పవర్ ఏంటో అధికార పార్టీకి స్పష్టంగా అర్థం అయిన నేపథ్యంలో మరోసారి బీజేపీకి ఛాన్స్ ఇవ్వకూడదే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సోషల్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది.

డివిజన్లను వెతుక్కోవడానికి టైమ్ లేదు

GHMC పరిధిలో కొత్త డివిజన్లు అనేకం ఏర్పడ్డాయి.ఏఏ ఏరియాలో ఏ డివిజన్లో వస్తాయి , ఆ డివిజన్ల వారికి ఓటర్ల లిస్ట్లు ఎలా తీసుకోవాలన్న దానిపై ఇప్పటి వరకు ఏ పార్టీకి స్పష్టత లేదు. ఇక అధికార పార్టీ విషయానికి వస్తే అన్ని ఏర్పాట్లను ఉందే చేసుకోవడంతో పాటు, అభ్యర్థుల జాబితాను కూడా రెడీ చేసింది.

ఇక మిగిలిన పార్టీలైన బీజేపీ ,కాంగ్రేస్ లకు డివిజన్లను గుర్తించడం, ఓటర్ల లిస్ట్ తెప్పించుకోవడం, అభ్యర్థులను ఎంపిక చేయడం , వారికి బీ ఫాం లను ఇచ్చి చెల్లుబాటు అయ్యే విధంగా నామినేషన్లు వేయించడం అది కూడా కేవలం మూడు రోజుల్లో సాధ్యం అయ్యే పని కానే కాదు. ఒక అభ్యర్థితో బీ ఫాం పూర్తి చేయించడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఏ విషయం తప్పుగా ఉన్న నామినేషన్ తిరస్కరిస్తారు కాబట్టి మెయిన్ అభ్యర్థితో పాటు డమ్మీ అభ్యర్థిని సైతం ఎంపిక చేయాల్సి ఉంటుంది.

ఇన్ని చేయడానికి టైమ్ 3 రోజులే మరి ప్రచారం ఎప్పుడు

పైన చెప్పుకున్నవి అన్ని చేయడానికి ఉన్న సమయం3 రోజులు మాత్రమే. ఈ లోపు ఏ డివిజన్ మిస్ అయిన ఆ డివిజన్ TRS చేతిలోకి వెళ్లి పోతుంది. అభ్యర్థులతో నామినేషన్లు వేయించడానికి నానా తంటాలు పడుతున్న కాంగ్రేస్ , బీజేపీ పార్టీలు ఇక గ్రౌండ్ లోకి వెళ్లి ఎప్పుడు ప్రచారం చేస్తాయి, ఎప్పుడు బ్యానర్లు , ఫ్లెక్సీలు , పోస్టర్లు చేయిస్తాయో ఇక దేవుడికే తెలియాలి.

టీవీ ఛానెల్స్ & పత్రికలు – సమస్యే లేదు

పోనీ టీవీ ఛానెల్స్ కి వెళ్లి ప్రమోట్ చేసుకుందాం అనుకున్నా , వాళ్ల వార్తలు రాయించుకుందాం అనుకున్నప్పటికి ఆ దారులు ప్రతిపక్షాలకు ఎప్పుడో మూసుకుపోయాయి. గొంతు చించుకున్నా , కత్తితో పొడుచుకున్న ఒక బ్రేకింగ్ వేసి ఊరుకుంటారు తప్ప ప్రత్యేక కథనాలు రానే రావు.

ఇలాంటి పరిస్థితుల్లో ఒక్క సోషల్ మీడియా తప్ప బీజేపీ , కాంగ్రేస్ లను ఆదుకునే దిక్కు లేనే లేదు. పది రకాల వ్యూహాలను అమలు చేయడం ఇప్పుడు అసాధ్యం. పోటీ చేసిన గెలిచే ఛాన్స్ లేదు కాని, అధికార పార్టీ గెలిచే డివిజన్ల సంఖ్యను తగ్గించడానికి ప్రయత్నం మాత్రం గట్టిగా చేయాలి. GHMC ఎన్నికలకు అధికార పార్టీ GHMC ఎన్నికల రూపంలోనే ఇచ్చిన ఆయుధాన్ని వినియోగించుకోని సోషల్ మీడియాను పరుగులుతీయిస్తే ఈ రెండు పార్టీలు తమ ముద్రను స్పష్టంగా వేస్తాయనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

ఈ సమయంలో ప్రతి పక్ష పార్టీలకు కావాల్సింది సరైన వ్యూహం , పరిధిలేని సోషల్ మీడియా సపోర్ట్ మాత్రమే. ఇవి లేకుండా ఎన్నికల బరిలో దిగినా ఒకటే దిగకపోయినా ఒకటే.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు