దిగొస్తున్న బంగారం ధరలు – ముడి చమురు ధరలకు రెక్కలు

gold and oil prices

బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. చాలా కాలం తర్వాత తులం ( 10 గ్రాముల ) బంగారం ధర.. 49 వేల దిగువకు చేరుకుంది. కరోనా వ్యాక్సిన్ రానున్న వార్తల నేపథ్యంలో.. ధరలు నేలచూపులు చూస్తున్నాయి. కొద్ది రోజులుగా అమ్మకాలు పెరగడం.. దీంతో నాలుగు నెలల కనిష్టస్థాయికి ధరలు పడిపోయాయి. అలాగే అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌ గెల్చినట్లు.. అధికారికంగా ప్రకటించడం.. కరో వ్యాక్సిన్లు వస్తున్నాయన్న వార్తలతో.. ప్రపంచ ఆర్థిక రికవరీపై అంచనాలు పెరిగినట్లు.. బులియన్ వర్గాలు వెల్లడించాయి.

దిగొస్తున్న బంగారం ధరలు – ముడి చమురు ధరలకు రెక్కలు

మరోవైపు చమురు ధరలు మాత్రం మూడు నెలల గరిష్టస్థాయికి చేరుకున్నాయి. ఫైజర్, మోడర్నా, ఆస్ట్రాజెనెకా వంటి వ్యాక్సిన్లు వస్తున్నాయన్న వార్తలతో.. ముడిచమురు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో చమురు ధరలు మూడు నెలల గరిష్టస్థాయికి చేరుకున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత.. సెంటిమెంట్‌ బలపడినట్లు.. నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగా.. మనదేశంలో కూడా పెట్రో ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి.

మరోవైపు చమురు ధరలకు బలాన్నిచ్చేందుకు రష్యా సహా ఒపెక్ దేశాలు.. ఉత్పత్తిలో కోతలు విధిస్తున్నారు. ఈ కోతలు.. వచ్చే జనవరి వరకు అమలు కానున్నాయి. అయితే దీనిపై చర్చించేందుకు.. ఈ నెల 30 నుంచి రెండు రోజుల పాటు.. ఒపెక్ దేశాలు సమావేశం కానున్నాయి. అయితే కోతలు వచ్చే జనవరి తర్వాత కూడా అమలు చేసే యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే వ్యాక్సిన్ల రాకతో.. ఆర్థిక రికవరీకి వీలు చిక్కుతుందని.. ఫలితంగా చమురు భారీగా డిమాండ్ పెరిగే అవకాశం ఉన్నట్లు.. సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు