రాజీనామాలు చేద్దాం రండి.. తిరుపతి ఎన్నికలో వైసీపీ సవాల్ – ఇప్పుడు టీడీపీ నాయకులు ఏం చేస్తాడు?

రాజీనామాలు చేద్దాం రండి.. తిరుపతి ఎన్నికలో వైసీపీ సవాల్ - ఇప్పుడు టీడీపీ నాయకుడు ఏం చేస్తాడు?

తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో మండే ఎండలను.. విజృంభిస్తున్న కరోనాను సైతం లెక్కచేయకుండా దూసుకువెళుతోంది. ఉప ఎన్నిక ప్రచారానికి సీఎం జగన్ రావటం లేదని ప్రకటించిన 24 గంటల్లోనో.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఊహించని సవాల్ బయటకు వచ్చింది.

ప్రత్యేక హోదా అంశంలో కేంద్రంపై పోరాటానికి సిద్ధంగా ఉన్నాం.. తిరుపతి ఉప ఎన్నికను రెఫరెండంగా తీసుకుంటున్నాం.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే.. 22 మంది ఎంపీలు రాజీనామా చేస్తారు.. ఉప ఎన్నికలో టీడీపీ ఓడిపోతే నలుగురు ఎంపీలు రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు చిత్తూరు జిల్లా పెద్దాయన, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో లోకేష్, ఇతర టీడీపీ నేతలు విసిరిన సవాళ్లు సీబీఐ పరిధిలో ఉంటే.. మంత్రి పెద్దిరెడ్డి విసిరిన సవాల్.. పార్టీ చేతుల్లో ఉంది. మేం ఓడిపోతే రాజీనామాకు సిద్ధం అని అధికార పార్టీ ఓపెన్ ఛాలెంజ్ చేసింది. మరి దీన్ని టీడీపీ స్వీకరిస్తుందా లేదా.. ఎందుకంటే ప్రత్యేక హోదా అనేది ప్రజల డిమాండ్, సెంటిమెంట్.. ఈ విషయంలో టీడీపీ అధినాయకుడు ఏం చేస్తారు.. ఎలా స్పందించారు అనేది చూడాలి.

ప్రత్యేక హోదా అంశంలో వైసీపీ ఛాలెంజ్ ను టీడీపీ స్వీకరించకపోతే.. ఓడిపోతాం అని ముందుగానే ఒప్పుకున్నట్లు అవుతుంది కదా అనే ఆందోళన టీడీపీలో నెలకొంది. దీనికి కౌంటర్ ఎవరు ఇస్తారు.. ఎలా ఇస్తారు అనేది ఇంట్రస్టింగ్ పాయింట్ అయ్యింది.

ఇక్కడ ఒక విశేషం ఏంటంటే.. తిరుపతి ఉప ఎన్నికను రిఫరెండంగా తీసుకోవటం లేదని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెంనాయుడు నామినేషన్ల ప్రక్రియ కంటే ముందే ప్రకటించారు. అలాంటప్పుడు వైసీపీ ఛాలెంజ్ ను.. పోలింగ్ కు ముందు పరిగణలోకి తీసుకుంటుందా లేదా అనేది కూడా చూడాల్సిన అంశం.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు