2024లో ఈనాడు పేపర్ ప్రింటింగ్ నిలిపివేత – సోషల్ మీడియాలో జోరుగా చర్చ – ఇప్పటికీ కళ్లు తెరవకపోతే.. డిజిటల్ సైతం గోవిందా

తెలుగు పత్రికా రంగంలో ‘ఈనాడు’ సంస్థ కొన్నేళ్లుగా అగ్రస్థానంలో కొనసాగుతూ వస్తోంది. కరోనా వైరస్ అన్ని రంగాలతో పాటు పత్రికా రంగాన్ని కోలుకోలేని దెబ్బ కొట్టింది. కరోనా వైరస్ పేపర్ల ద్వారా వ్యాప్తి చెందుతున్న ప్రచారంతోపాటు.. లాక్ డౌన్ కారణంగా సర్క్యులేషన్ 80 శాతం పడిపోయింది. ఈనాడు పత్రిక రోజువారీగా 16 లక్షల కాపీలు ప్రింట్ చేసి మార్కెట్ లోకి విడుదల చేస్తుంటే.. లాక్ డౌన్ తర్వాత అది 5 లక్షలకు పడిపోయిందని టాక్ వినిపిస్తోంది. ఏడాది కాలంగా ఉన్న కరోనా, లాక్ డౌన్ పరిణామాలతో తెలుగు, ఇంగ్లీష్, హిందీ పేపర్లు అన్నీ తీవ్రనష్టాలను మూటగట్టుకున్నాయి. అందరూ డిజిటల్ వైపు అలవాటు పడ్డారు. లాక్ డౌన్ పీరియడ్ లో డిజిటల్ న్యూస్ రీడింగ్ ఏకంగా 80 శాతం పెరుగుదల నమోదు చేయటం దీనికి ఎగ్జాంపుల్.

ఈ పరిణామాలతోనే.. 2024 నాటికి ఈనాడు పత్రిక ప్రింటింగ్, సర్క్యులేషన్ నామ మాత్రానికి పరిమితం చేసి.. డిజిటల్ రంగాన్ని మరింత పరిపుష్టి చేయాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. అందులో భాగంగా ఉద్యోగుల సంఖ్యను క్రమంగా తగ్గిస్తూ వస్తున్న ఈనాడు యాజమాన్యం.. 2024 నాటికి ప్రింటింగ్ వ్యవస్థ మొత్తాన్ని ఔట్ సోర్సింగ్ ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆ సంస్థ ఉద్యోగులే చర్చించుకుంటున్నారు. ప్రింటింగ్ విభాగంలో పర్మినెంట్ ఉద్యోగులకు జీతాలు భారీగా ఉండటంతో.. వాళ్లను తొలగించి ఔట్ సోర్సింగ్ ఇవ్వటం ద్వారా 50 శాతం నష్టాలను భర్తీ చేయొచ్చని అంచనా వేస్తున్నారంట. ఇందులో భాగంగా పైలెట్ ప్రాజెక్ట్ కింద గుంటూరు జిల్లా యూనిట్ లో ప్రింటింగ్ విభాగాన్ని ఔట్ సోర్సింగ్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. 2024 నాటికి అన్ని ప్రింటింగ్ యూనిట్లలో పర్మినెంట్ ఎంప్లాయ్ అనే వాళ్లు లేకుండా ఔట్ సోర్సింగ్ ద్వారా పత్రికను ప్రింట్ చేయనున్నారు.

పత్రిక ప్రింట్ చేసి మార్కెట్లోకి రావాలంటే కనీసం 20 రూపాయలు ఖర్చవుతుంది.. అమ్మేది ఆరున్నర రూపాయలకు.. దీనికితోడు వ్యాపారుల కమీషన్.. ఇవన్నీ పోను.. ఒక్కో పేపర్ పై 16 రూపాయల నష్టం వస్తుందంట. కరోనాతో యాడ్స్ లేవు.. ఏపీ, తెలంగాణతోపాటు కేంద్ర ప్రభుత్వం సైతం అడ్వటైజ్ మెంట్లు తగ్గించేసింది.. డిజిటల్ విప్లవంతో.. పత్రికలకు యాడ్స్ ఇచ్చేవాళ్లు కరువయ్యారు.. ఇప్పటి వరకు ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ఉండటంతో భారీగా లబ్ధిపొందారు. ఇప్పుడు జగన్ సీఎం అయ్యాడు.. రాజకీయ విరోధి కావటంతో సహజంగా యాడ్స్ తగ్గిపోయాయి. అసలు ఏపీ ప్రభుత్వం యాడ్స్ ఇవ్వటమే లేదు.. ఈ క్రమంలోనే ఈనాడు మొత్తాన్ని డిజిటల్ వైపు మళ్లించటానికి ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నారంట.

ఈటీవీ భారత్ పేరుతో తీసుకొచ్చిన యాప్ అట్టర్ ప్లాప్ అయ్యింది. కనీసం రోజుకు లక్ష వ్యూస్ కూడా రావటం లేదు. కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్న ఈనాడు యాజమాన్యం.. అందుకు తగ్గట్టు ఉద్యోగుల నియామకంలో మాత్రం సంప్రదాయ ధోరణిలో కొనసాగటం ఈటీవీ భారత్ వైఫల్యానికి కారణం. పేపర్ వేరు.. ఛానల్ వేరు.. డిజిటల్ అంత కంటే వేరు.. పత్రికల్లో పని చేసే వాళ్లను డిజిటల్ వైపు రిక్రూట్ చేస్తే పతనం ఇలాగే ఉంటుంది. ఇప్పటికైనా ఈటీవీ భారత్ విషయంలో జరిగిన పొరపాట్లను సరిచేసుకుని.. డిజిటల్ వ్యవస్థను గాడిలో పెట్టుకుంటే.. 2024 నాటికి నిలబడతారు.. లేకపోతే పేపర్ తోపాటు డిజిటల్ వ్యవస్థ సైతం గోవిందా..

2024లో ఈనాడు పేపర్ ప్రింటింగ్ నిలిపివేత – సోషల్ మీడియాలో జోరుగా చర్చ – ఇప్పటికీ కళ్లు తెరవకపోతే.. డిజిటల్ సైతం గోవిందా

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు