Online Class: ఆన్‌లైన్‌ క్లాసులోకి వచ్చి టీచర్ ని తిట్టిన ఆగంతకుడు

Online Class: ఆన్లైన్ క్లాసులోకి ఆగంతకులు చొరబడి నానాయాగీ చేస్తున్నారు. తాజాగా ఓ ఆన్లైన్ క్లాసులోకి గుర్తు తెలియని వ్యక్తి లాగ్ ఇన్ అయ్యాడు. టీచర్ తో గొడవకు దిగాడు. టీచర్ తో దురుసుగా మాట్లాడి చాలా సేపు వాదించాడు. దీనికి సంబందించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక తాజాగా మరో పోకిరి ఆన్లైన్ క్లాసులో జాయిన్ అయి గందరగోళం చేసినట్లుగా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ రిజిస్టర్ అయింది. వివరాల్లోకి వెళితే.. అంబర్‌పేట సిస్టర్‌ నివేదిత స్కూల్‌ విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తుండగా ఓ గుర్తు తెలియని వ్యక్తి విద్యార్థి లాగ్ ఇన్ ద్వారా క్లాసులోకి ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ విద్యార్థుల పేర్లు మార్చుతూ టీచర్ కి విసుగు తెప్పించాడు.

మ్యూట్ లో పెట్టకుండా టీచర్ తో గొడవకు దిగాడు. దీంతో ఆమె ప్రిన్సిపాల్ లతా కుమారికి ఫిర్యాదు చేసింది. ప్రిన్సిపాల్ లతా కుమారి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే గతంలో కూడా ఇటువంటి న్యూసెన్స్ పై పోలీసులకు అనేక ఫిర్యాదు అందాయి. ఇటువంటి చర్యలకు పాల్పడేవారిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు