బీజేపీలోకి గట్టు శ్రీకాంత్ రెడ్డి

వైఎస్ఆర్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి త్వరలో బీజేపీలో చేరనున్నారు. గత నెలలో హుజుర్ నగర్ లో తన అనుచరులతో సమావేశం ఏర్పాటు చేసి వారితో చర్చించారు. ఇక శనివారం ఆయన వైసీపీ పార్టీకి తన అధ్యక్ష పదవికి రాజీనామా చేయనున్నారు. అనంతరం బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. 5000 వేలమంది అనుచరులు కార్యకర్తలతో గట్టు బీజేపీలో చేరనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో వైసీపీ తరపున హుజుర్ నగర్ నియోజకవర్గం నుంచి గట్టు శ్రీకాంత్ రెడ్డి పోటీ చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి గట్టి పోటీ ఇచ్చారు.

నల్గొండ జిల్లాలో గట్టు శ్రీకాంత్ రెడ్డికి మంచి పేరుంది. హుజుర్ నగర్ నియోజకవర్గంలో ఆయనను అభిమానించేవారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇక గట్టు శ్రీకాంత్ రెడ్డికి ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ కు మధ్య మంచి సన్నిహిత సంబంధం ఉంది. అయితే అందరు ఆయన షర్మిల పార్టీలో చేరతారని అనుకున్నారు. కానీ బీజేపీలో చేరేందుకు తమ కార్యకర్తలు మొగ్గు చూపడంతో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. శ్రీకాంత్ రెడ్డి మంచి విద్యావంతుడు ఆయన కాకతీయ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేశారు. అనంతరం జగన్ తో మంచి సంబంధాలు ఉండటంతో రాజకీయాల్లోకి వచ్చారు. కార్యకర్తగా చేరి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదిగారు. ఇక గట్టు రాకను బీజేపీ నేతలందరూ స్వాగతిస్తున్నారు.

Big Breaking : డ్రగ్స్ మాఫియాలో నలుగురు తెలంగాణ ఎమ్మెల్యేలు

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు