హ్యాపీ బర్త్ డే అంబానీ : అంబానీ ఓ నిమిషం సంపాదన మధ్యతరగతి కుటుంబం జీవితం – ఆసియా ఖండంలోనే ధనవంతుడు

happy birthday to mukesh ambani

భారతదేశంలోనే కాదు ఆసియా ఖండంలోనే ధనవంతుల్లో నెంబర్ వన్ ఎవరూ అంటే ముకేష్ అంబానీ. మన భారతీయుడు అని గర్వంగా చెప్పుకోవాలి. ముఖేష్ అంబానీ కంపెనీల మార్కెట్ విలువ అక్షరాల 12 లక్షల కోట్ల రూపాయలు. అమెరికా డాలర్లలో అయితే 8 వేల 450 కోట్ల డాలర్లు. ముఖేష్ అంబానీ వ్యక్తిగత ఆస్తుల విలువ 4 లక్షల కోట్ల రూపాయల వరకు ఉంది.

ముఖేష్ అంబానీ వ్యక్తిగత ఆస్తుల విలువ.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఒక ఏడాది బడ్జెట్ అంత. అంబానీ తలచుకుంటే రెండు తెలుగు రాష్ట్రాలను కొనేయవచ్చు. ప్రపంచంలోనే రెండో ఖరీదైన ఇల్లు అంబానీ సొంతం. ముంబైలో 27 అంతస్తుల్లో.. 8 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇతని నివాం యాంటిలా ఉంది. 27 అంతుస్తులే అయినా.. మిగతా బిల్డింగ్స్ 60 అంతస్తులతో పోల్చుకున్నప్పుడు.. వాటితో అంబానీ ఇల్లు సమానంగా ఉంటుంది.

అంబానీ ఇల్లు యాంటిలా పైన.. ఒకేసారి నాలుగు హెలికాఫ్టర్లు ల్యాండ్ కావొచ్చు. అంబానీ ఇల్లు మొత్తం బుల్లెట్ ప్రూఫ్ తో తయారైంది. బుల్లెట్లు, మిసైల్స్ వేసినా చెక్కు చెదరదు.అంబానీ ఇంట్లో పని చేసేవారు, కాపలా ఉండే వారు మొత్తం 600 మంది ఉంటారు. ముఖేష్ అంబానీకి సొంతంగా రెండు హెలికాఫ్టర్లు, ఓ జెట్ విమానం ఉన్నాయి. రూ.600 కోట్ల రూపాయల విలువైన క్రూయిజ్ షిఫ్ (పడవ) ఉంది. గుజరాత్ రాష్ట్రం జామ్ నగర్ లో భారతదేశంలోనే అత్యంత పెద్ద ఆయిల్ రిఫైనరీ యూనిట్ ఉంది.

జియోతో మొబైల్ డేటాను తక్కువ ధరకు ఇచ్చి.. ప్రపంచాన్ని షాక్ కు గురి చేశారు. ఒక జీబీ డేలా 26 పైసలకు తీసుకొచ్చిన ఘనత అంబానీ సొంతం. 2020 లాక్ డౌన్ సమయంలో.. అంబానీ కంపెనీలు గంటకు 90 కోట్ల రూపాయల సంపద పెరుగుతూ వచ్చింది. లాక్ డౌన్ కాలంలో పేదలను ఆదుకోవటానికి 500 కోట్ల రూపాయల విరాళం ఇచ్చారు. అంబానీ ఒక నిమిషం సంపాదన.. భారతదేశంలో నెలకు లక్ష రూపాయల జీతంతో.. జీవితాంతం బతికే మధ్య తరగతి కుటుంబంతో సమానం. ఇవన్నీ జస్ట్కొ న్నిమాత్రమే.. అతని కంపెనీలు, సంపద, ఆస్తుల వివరాలు మొత్తం రాయాలంటే.. 200 పేజీలు అవుతుంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు