సినిమా ధియేటర్లపై కరోనా చర్యలు తీసుకోండి : హైకోర్టు ఆదేశాలతో వకీల్ సాబ్ టెన్షన్

సినిమా ధియేటర్లపై కరోనా చర్యలు తీసుకోండి : హైకోర్టు ఆదేశాలతో వకీల్ సాబ్ టెన్షన్

తెలంగాణ రాష్ట్రంలో రోజుకు 2 వేల కరోనా కేసులు కొత్తగా నమోదు అవుతున్నాయి.. ఇప్పటికే 12 వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి.. అయినా కూడా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవటం లేదంటూ అసహనం, అసంతృప్తి వ్యక్తం చేసింది తెలంగాణ హైకోర్టు.

అత్యవసరంగా సినిమా ధియేటర్లు, మాల్స్, బార్లు, వైన్ షాపులు, పబ్స్ పై కరోనా ఆంక్షలు విధించాలని ఆదేశించింది. ప్రజలు ఎక్కువగా, రద్దీ ప్రాంతాలపై దృష్టి పెట్టాలని ఆదేశించింది హైకోర్టు.

ఆర్టీపీఎస్ పరీక్షలను వీలైనన్ని పెంచాలని.. అదే విధంగా ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చే వారి నుంచి నో కోవిడ్ సర్టిఫికెట్ ఉంటేనే అనుమతించాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది.

తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో ఏప్రిల్ 9వ తేదీన విడుదల కానున్న వకీల్ సాబ్ మూవీ విడుదల ఉంటుందా.. ఉండదా అనే హైరానా మొదలైంది వపన్ ఫ్యాన్స్ లో.. ఇప్పటికే ప్రధాని మోడీ మీటింగ్ ద్వారా ఎలాంటి నిర్ణయం వస్తుందో అని భయపడుతున్న ఫ్యాన్స్.. తెలంగాణ హైకోర్టు మరింత షాక్ ఇచ్చింది.

తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో సినిమా ధియేటర్లపై ఆంక్షలు విధిస్తే పరిస్థితి ఏంటీ అనే ఆందోళన ఉంది. ఇప్పటికే టికెట్ 500 రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు ఫ్యాన్స్. డబ్బులు పోతేపోయాయి.. హీరో సినిమా ధియేటర్లలో పడుతుందా లేదా అనేది చూడాలి. ఎందుకంటే ఇది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదు.. హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు.. దాన్ని ఎవరూ ధిక్కరించలేదు. ప్రజారోగ్యానికి సంబంధించిన అంశం కాబట్టి.. పవన్ కల్యాణ్ తప్పుపట్టలేరు కదా.ఇదే ఇప్పుడు పవర్ స్టార్ అభిమానులను గందరగోళానికి గురి చేస్తుంది..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు