చిత్తూరు – కేరళ – కర్ణాటక అడవుల్లో తిష్ట వేయడానికి ప్రయత్నించిన ISIS ఉగ్రవాద సంస్థ

isis plans to establish in south india

చిత్తూరు – కేరళ కర్ణాటక అడవుల్లో తిష్ట వేయడానికి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ISIS ప్రయత్నించినట్టు జాతీయ భద్రతా సంస్థ NIA వెల్లడించింది. దక్షిణ భారతదేశంలోని కేరళ-కర్ణాటక-ఆంధ్రప్రదేశ్-తమిళనాడు రాష్ట్రాల్లోని దట్టమైన అటవి ప్రాంతాల్లో బృందాలను ఏర్పాటు చేసి శిక్షణ తరగతులు నిర్వహించాలని భావిస్తున్న ISIS సంస్థపై NIA ఎఫ్.ఐ.ఆర్ ను నమోదు చేసింది.

హిందూ దేవాలయాలు -రాజకీయ నాయకులే లక్ష్యంగా శిక్షణ

భారతదేశంలో ప్రముఖ హిందూ దేవాలయాలు, రాజకీయ నాయకులతో పాటు అనేక మంది ప్రముఖులను టార్గెట్ గా చేసుకోని దాడులు నిర్వహించడానికి అవసరం అయితే వారిని చంపడానికి దట్టమైన అడవుల్లో క్యాంపులను ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు పట్టుబడిన వారు దర్యాప్తు అధికారులకు వెల్లడించారు.

బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ISIS సానుభూతిపరుడు మెహబూబ్ పాషా, తమిళనాడులోని కడలూరుకు చెందిన మరో ISIS సానుభూతిపరుడు ఖాజా మొయిదీన్ నేతృత్వంలో ఈ మాడ్యూల్ పని చేస్తున్నట్టు దర్యాప్తులో తేలింది. ఈ మాడ్యుల్లో మొత్తం 20 మంది సభ్యులు ఉన్నట్టు NIA తన చార్జిషీట్ లో ప్రేర్కోంది.

దొంగ సిమ్ కార్డుల కేసులో బయటపడిన అసలు నిజం – ఇప్పటికే భారీ మందు సామాగ్రి సేకరణ

వినియోగదారులకు తెలియకుండా వారి ఆధార్, పాన్, పాస్ పోర్ట్ వంటి ప్రూఫ్ లను వాడుకోని సిమ్ కార్డులను యాక్టివేట్ చేసి వాడుకుంటున్నారనే ఆరోపణల మీద NIA బృందం గత ఏడాది అంటే 2020 తమిళనాడులోని సేలం ప్రాంతం నుండి కొందరిని అదుపులోకి తీసుకుంది. వారిని విచారిస్తున్న సమయంలో ISIS ఇండియాలో చేయాలని చూస్తున్న కుట్ర బయటపడింది.

NIA అధికారులకు పట్టుబడటానికి ముందే, బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న ఈ బృందం పెద్ద ఎత్తున మందు గుండు సామాగ్రి, తుపాకులు, బాణాలు, స్లీపింగ్ బ్యాగులు, భారీ పేలుడును సృష్టించగల ఐడీఈలను సేకరించినట్టు తేలింది. సానుభూతి పరులంత కలసి దక్షిణ భారతదేశంలోని అడవుల్లో ఒక క్యాంపును ఏర్పాటు చేసి అక్కడ తమ ఉగ్రవాద శిక్షణతో పాటు బాంబు దాడులు చేయడానికి కావాల్సిన ప్రణాళికలను రూపొందించుకోవడానికి ప్రణాళిక రచించినట్టు దర్యాప్తులో తేలింది.

బృందానికి సాయం అందించిన సైంటిస్ట్

ISIS క్యాంపును దక్షిణ భారతదేశంలో ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్న బృందానికి తిరువనంతపురానికి చెందిన సయ్యద్ అలీ అనే ఒక సైంటిస్ట్ సహాయం చేస్తున్నట్టు NIA గుర్తించింది. టెక్నాలజీపై పూర్తి అవగాహాన ఉన్న సయ్యద్ అలీ డార్క్ నెట్ నుండి అవసరమైన సామాగ్రిని కొనుగోలు చేయడంతో పాటు, ISIS బృందాలు నిర్వహించుకునే ఆన్ లైన్ సమావేశాలను మూడోకంటికి తెలియకుండా ( encrypt ) చేయడం వంటి కార్యకలాపాలను నిర్వహించడానికి సాయం చేసినట్టు తేలింది. అలాగే ఐడీఈ ఉపయోగించి భారీ పేలుళ్లను దూరం నుండే సృష్టించడానికి కావాల్సిన సాంకేతికతను సైతం ఇతనే సమకూర్చినట్టు తేలింది. మొత్తం ఈ 20 బృందం పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టిన NIA మరింత సమాచారం లాగేందుకు ప్రయత్నిస్తుంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు