Kadapa News: ప్రేమ వ్యవహారం.. యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన సోదరుడు.

Kadapa News: ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంటానని చెప్పిన యువతిపై ఇంట్లోని వారు పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. ఈ దారుణ ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. కడప జిల్లా రాయచోటి సీఐ జీ. రాజు కథనం మేరకు.. సదరు యువతి స్థానికంగా ఓ యువకుడిని ప్రేమించింది. అయితే వీరి ప్రేమ విషయం నచ్చని కుటుంబ సభ్యులు యువతికి వేరే సంబంధాలు చూస్తున్నారు.

అయితే ఎన్ని సంబంధాలు వచ్చిన అనే వాటిని చెడగొడుతోంది. ఈ విషయమై కుటుంబ సభ్యులకు యువతికి మధ్య గత కొద్దీ రోజులుగా గొడవ జరుగుతుంది. ఇదే క్రమంలో మంగళవారం ఆమె పెళ్లి విషయమై బలవంతం చేశారు. అయితే తాను సస్సేమిరా చేసుకోనని తెగేసి చెప్పింది. తాను ప్రేమించిన వాడితోనే పెళ్లి చెయ్యాలని కోరింది. తాము ఎన్ని సంబంధాలు తెచ్చిన చెడగొడుతుంది అనే కోపంతో ఆమెపై పెట్రోల్ పోసి నిప్పందించాడు సోదరుడు.

మంటలను తట్టుకోలేక ఆమె కేకలు వేయడంతో ఆమె సోదరి, స్థానికులు వచ్చి మంటలు ఆర్పారు. తీవ్రంగా గాయపడిన ఆమెను కడప రిమ్స్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నందుకు చేసుకున్న రాయచోటి పోలీసులు విచారణ చేపట్టారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు