ఇంట్లోనే క‌షాయం త‌యారీ విధానాన్ని తెలుసుకుందాం..!

Let's learn the process of preparing the infusion at home

చిన్నా, పెద్దా అన్న భేదం ఏ మాత్రం లేకుండా క‌రోనా మ‌హ‌మ్మారి అందర్ని భ‌య‌పెడుతోంది. యావ‌త్ ప్ర‌పంచాన్నే చుట్టుముట్టేసింది. ప‌రిస్థితుల‌ను చూసిన ప్ర‌జ‌లు ఇళ్ల నుంచి అడుగు బ‌య‌ట పెట్టాలంటేనే భ‌య‌ప‌డుతున్నారు. ఆఖ‌ర‌కు మాస్క్ ధ‌రించే నిద్రిస్తున్నారు. అంత‌లా భ‌య‌‌పెడుతోంది. అయితే, ఈ వైర‌స్‌ను చూసి మ‌రీ అంత‌లా భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని, ముంద‌స్తు ఆరోగ్య జాగ్ర‌త్త‌లు తీసుకుంటే స‌రిపోతుంద‌ని వైద్యులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా శ‌రీరంలో వ్యాధి నిరోధ‌క శ‌క్తిని పెంపొందించే ఆహారం తీసుకోవాల‌ని, ఆయుర్వేద చిట్కాలు పాటించాలని సూచిస్తున్నారు.

కరోనా సోక‌కుండా ఉండేలా ముంద‌స్తు జాగ్ర‌త్తగా క‌షాయం తీసుకుంటే మంచిద‌ని ప‌లువురు ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దీంతో సాధార‌ణ వ్య‌క్తి నుంచి సెల‌బ్రిటీలు, సినీ నిర్మాత‌లు సైతం వారి టీ సమ‌యంలో క‌షాయాన్ని తీసుకుంటున్నారు. ఇలా ఆరోగ్య జాగ్ర‌త్త‌లు పాటిస్తూ వారి హెల్త్‌ను కాపాడుకుంటున్నారు. ఇంత‌కీ శ‌రీరంలో వ్యాధి నిరోధ‌క శ‌క్తిని పెంపొందించే క‌షాయాన్ని ఎలా త‌యారు చేస్తారు..?, త‌యారీ విధానంలో ఏమేం వాడ‌తారు..? ఎటువంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి..? వ‌ంటి అంశాల‌ను మ‌నం ఇప్పుడు తెలుసుకుందాం.

ప‌సుపు – రెండు టీ స్పూన్లు
మిరియాలు – ప‌ది
ల‌వంగాలు – ఏడు
స‌రిప‌డిన‌న్ని దాల్చిన చెక్క ముక్క‌లు
స‌రిప‌డినంత అల్లం
కొద్దిగా తుల‌సి ఆకులు

ముందుగా పావు క‌ప్పు ప‌చ్చి ప‌సుపును తొక్కు చెక్కుకుని పెట్టుకోవాలి. ప‌చ్చిప‌సుపు లేన‌ట్ల‌యితే ఇంట్లోనే మ‌ర‌ప‌ట్టించిన‌టువంటి పసుపును రెండు టేబుల్ స్పూన్ల‌ను తీసుకోవాలి (మార్కెట్‌లో అమ్మే పసుపును మాత్రం వాడ‌కూడ‌దు). మిరియాలు ప‌ది, ల‌వంగాలు ఏడు, దాల్చిన చెక్క ముక్క‌లు, అల్లం, కొద్దిగా తుల‌సి ఆకులు, గుప్పెడు లేదా అర‌క‌ప్పు వ‌ర‌కు వేసుకోవ‌చ్చు.

రోట్లో ప‌ది మిరియాలు, ఏడు ల‌వంగాలుల‌, రెండు దాల్చిన చెక్క ముక్క‌లు వేసుకుని క‌చ్చాపచ్చ‌గా దంచుకోవాలి. ఇలా దంచిన త‌రువాత వాటిని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. ఆ త‌రువాత అల్లం ముక్క‌లు, ప‌చ్చి ప‌సుపు కొమ్ముల‌ను కూడా వేసుకుని క‌చ్చా ప‌చ్చ‌గా దంచుకోవాలి. ఇలా దంచుకున్న త‌రువాత వాటిని కూడా ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇలా త‌యారు చేసుకుని పెట్టుకున్న త‌రువాత ఒక పాత్ర‌లో 12 గ్లాసుల వాట‌ర్ వేసుకుని అందులో క‌చ్చా ప‌చ్చాగా దంచుకున్న ల‌వంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క‌పొడిని వేసుకుని ముందుగా దంచిపెట్టిన ప‌చ్చి ప‌సుపును కూడా వేసుకోవాలి. త‌రువాత తుల‌సి ఆకుల‌ను కూడా వేసుకుకుని బాయిల్ చేసుకోవాలి.

15 నుంచి 20 నిమిషాల వ‌ర‌కు నీటిలో మ‌రిగించిన త‌రువాత స్టౌవ్ ఆఫ్ చేసెయ్యాలి. మ‌రిగిన నీటి బౌల్‌పై మూత‌పెట్టి గోరు వెచ్చ‌గా చ‌ల్లార‌య్యే వ‌ర‌కు వేచి చూడాలి. గోరు వెచ్చ‌గా చ‌ల్లారిన త‌రువాత ఆ నీటిని వేరొక పాత్ర‌లోకి ఒడ‌క‌ట్టాలి. ఇలా ఒడ‌క‌ట్టుకున్న క‌షాయాన్ని ప‌ర‌గ‌డుపున ఒక గ్లాసు, సాయంత్రం ఐదు గంట‌ల స‌మ‌యంలో ఒక గ్లాసు రోజుకు రెండుసార్లు మూడు రోజుల‌పాటు తీసుకోవాలి. ఇలా క‌షాయం చేసుకుని తాగ‌డం కార‌ణంగా శ‌రీరంలో నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంద‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. క‌షాయం తీసుకోవ‌డంతోపాటు ఆరోగ్య జాగ్ర‌త్త‌లు పాటిద్దాం – నిత్యం ఆరోగ్యంతో జీవిద్దాం.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు