బ్యాంకులకు రూ.273 కోట్లు ఎగ్గొట్టిన ఎంపీ రఘురామకృష్ణం రాజు – అరెస్ట్ చేయనున్న తమిళనాడు పోలీసులు

tamilnadu people to arrest raghu ramakrishanam raju

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు నేత, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు అరెస్ట్ కు రంగం సిద్ధం అయ్యింది. ఎల్లో మీడియాలో రోజూ నీతులు చెప్పే ఈ ఎంపీ.. తెర వెనక చేసిన బాగోతాలు తెలుసుకున్న ముక్కున వేలేసుకుంటున్నారు జనం. అమ్మా రఘురామకృష్ణం రాజు అంటూ అవాక్కయ్యారు. రోజూ చెప్పే ప్రవచనాలు – చేసే పనులకు అస్సలు పోలిక లేదని.. ఇన్ని వందల కోట్లు దోపిడీ చేశారా అని ఆశ్చర్యపోతున్నారు జనం. ఇలాంటి నేతనా రోజూ ఎల్లో మీడియా హైలెట్ చేస్తుంది అని షాక్ అయ్యారు.

ఇంద్‌ భారత్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ కోసం ఎంపీ రఘురామకృష్ణంరాజు 273 కోట్ల రూపాయలను బ్యాంక్ నుంచి అప్పుగా తీసుకుని ఎగ్గొట్టారు. ఎన్ని బ్యాంకులు నోటీసులు ఇచ్చినా.. అప్పు తిరిగి కట్టకపోవటంతో.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెన్నై బ్రాంచ్‌ డిప్యూటీ జనరల్ మేనేజర్‌ రవిచంద్రన్‌ 2021, మార్చి 23వ తేదీ సీబీఐకి కంప్లయింట్ చేశారు. అప్పు తీసుకుని కావాలనే ఎగ్గొట్టారని.. అందుకు సంబంధించి అన్ని ఆధారాలను సీబీఐకి అందించారు స్టేట్ బ్యాంక్ ఇండియా జనరల్ మేనేజర్. ఫోర్జరీ డాక్యుమెంట్లు, దొంగ సంతకాలతో బ్యాంకును మోసం చేశారని.. బ్యాంక్ నుంచి తీసుకున్న 273 కోట్ల రూపాయలను సొంత ఆస్తులు, ఇతర సంస్థలకు మళ్లించారని బ్యాంక్ అధికారులు కంప్లయింట్ లో స్పష్టం చేశారు. అన్ని ఆధారాలు పక్కాగా ఉండటంతోపాటు మోసం జరిగిందని.. బ్యాంక్ అప్పు ఎగ్గొట్టారని నిర్థారణకు వచ్చిన సీబీఐ.. ఎంపీ రఘురామకృష్ణంరాజుతోపాటు.. మరో తొమ్మిది మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది సీబీఐ.

తెలుగుదేశం పార్టీలో ఉన్న సమయంలోనే.. రఘురామకృష్ణంరాజు బ్యాంక్ నుంచి వందల కోట్లు అప్పు తీసుకున్నారు. 273 కోట్ల రూపాయలను ఉద్దేశపూర్వకంగా సొంత ఆస్తులకు మళ్లించినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీబీఐకి ఇచ్చిన కంప్లయింట్ లో స్పష్టం చేసింది. సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయటంతో.. రానున్న వారం, పది రోజుల్లోనే తమిళనాడు సీబీఐ అధికారులు.. ఎంపీ రఘురామకృష్ణంరాజును అరెస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.

ఉదయం లేస్తే నీతులు, ప్రవచనాలు చెప్పే ఈ ఎంపీనా.. వందల కోట్ల జనం సొమ్మును మింగేసింది అని ఏపీ ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఇన్నిన్ని కోట్లు బ్యాంకుల నుంచి అప్పుగా తీసుకుని ఎగ్గొట్టటం అంటే మాటలు కాదని.. మల్యా, నీరవ్ మోడీ గుర్తుకొస్తున్నారని అంటున్నారు జనం.

వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న ఎంపీ రఘురామకృష్ణంరాజు.. ఇప్పటికే బ్యాంకులకు ఎగ్గొట్టిన జనం సొమ్మును తిరిగి కట్టేయాలని డిమాండ్ చేస్తున్నారు జనం. అప్పుడే ఆయన చెప్పే మాటలకు – చేతలకు విలువ ఉంటుందని అంటున్నారు జనం. ఉదయం లేస్తే జనం గురించి మాట్లాడే ఈయన.. జనం సొమ్ము ఎగ్గొట్టటం ఏంటయ్యా.. ఇదే లెటేస్ట్ టాక్..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు