కూల్ బాబూ కూల్.. లోకేష్ కు స్పెషల్ ట్రైనింగ్

naralokesh became very slim than before

తిరుపతి ఉప ఎన్నికలో టీడీపీ యువ నేత, కాబోయే సీఎం అభ్యర్థి నారా లోకేష్ ప్రచారం ముగిసింది. హైదరాబాద్ ఇంటికి తిరిగొచ్చారు. ఆ వెంటనే చంద్రబాబు తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలోకి దిగారు. ఏప్రిల్ 14వ తేదీ సాయంత్రం వరకు తిరుపతిలోనే మకాం వేయనున్నారు బాబు.

తిరుపతి ఉప ఎన్నిక ప్రచారం నుంచి వచ్చిన నారా లోకేష్.. స్పెషల్ ట్రైనింగ్ తీసుకోనున్నట్లు జూబ్లీహిల్స్ సమాచారం. ముఖ్యంగా కూల్ బాబూ కూల్ అన్నట్లు.. ఆవేశంలో వచ్చే బూతులు తగ్గించుకోవాలన్న సన్నిహితుల సూచనలతో ప్రముఖు ట్రైనర్ల నుంచి కొంత ట్రైనింగ్ తీసుకోబోతున్నారంట. ఎప్పుడు పడితే అప్పుడు.. సమయం, సందర్భం లేకుండా సవాళ్లు, బూతులు మాట్లాడటం వల్ల మాస్ లీడర్ ఇమేజ్ రాదని.. దానికి సమయం, సందర్భం ఉండాలని ఆప్తులతోపాటు చంద్రబాబు సలహాతో ఈ లోకేష్ బాబుకు ఈ ట్రైనింగ్ ఇస్తున్నట్లు టీడీపీ లీడర్స్ కొందరు చెప్పుకుంటున్నారు.

రాజకీయాల్లో టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్.. సందర్భాన్ని బట్టి మాట, రాత ఉండాలి.. లింక్ లేకుండా మాట్లాడితే జనంలో కనెక్టివిటీ దెబ్బతింటుంది.. ఫాలో అప్ ఉండాలి అంటే ఫాలోయింగ్ పెంచుకోవాలి.. అందుకు తగ్గట్టుగానే మన రాతలు, చేతలు, ఆవేశాలు, ఆవేదనలు ఉండాలని సూచించారంట సైకాలజిస్టులు.

ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలో హత్యకు గురైన కొంత మంది టీడీపీ కార్యకర్తలను స్వయంగా పరామర్శించి.. వారి కుటుంబాలకు మనోదైర్యం ఇచ్చిన సందర్భాల్లో లోకేష్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం అంట. సానుభూతి ద్వారా ప్రజల్లో ఆలోచన రేకెత్తించాల్సిన సమయంలో.. అర్థం లేని ఆవేశంతో సద్వినియోగం చేసుకోలేకపోయారు అనేది టీడీపీ నుంచి వస్తున్న కామెంట్ అంట..

ఇలాంటి రివ్యూల ఆధారంగా లోకేష్ బాబుకు  ట్రైనింగ్ ఇప్పించాలని నిర్ణయించారంట. ప్రస్తుతం అన్ని ఎన్నికలు అయిపోయాయి కాబట్టి.. ఓ నెల రోజులు దీనిపై చినబాబు దృష్టి పెటట్నున్నారంట..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు