పార్టీలో ఉన్నారా లేదా.. ఏదో విషయం తేల్చుకోండి.. గంటాకు అల్టిమేటం ఇచ్చిన లోకేష్

naralokesh warning to ganta over party

ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాపై ఫోకస్ చేసిన లోకేష్.. విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి గెలిచిన గంటా శ్రీనివాసరావుకు టచ్ లోకి వెళ్లారు. మీరు పార్టీలో ఉన్నారా లేదా.. ఏదో విషయం తేల్చుకోండి అంటూ స్పష్టం చేశారంట. పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగాలి అనుకుంటే అభ్యంతం లేదని.. వదలుకోవటానికి పార్టీ ఇష్టంగా లేదని.. అయితే ఐడియల్ గా ఉండటం మంచిది కాదని స్పష్టం చేశారంట లోకేష్. ఇటీవల వైజాగ్ సిటీలో టీడీపీ నేతల ఆస్తులపై దాడులు, ఆక్రమణల తొలగింపు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బెదిరింపులకు దిగుతుంది. అలాంటి సమయంలోనూ.. పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న గంటా శ్రీనివాసరావు కనీసం స్పందించకపోవటం పార్టీ నేతలు, కార్యకర్తలను అసహనానికి గురి చేసింది.

వైజాగ్ సిటీలోనే పార్టీ ఎమ్మెల్యే ఉన్నా.. ఓ పార్టీ నేత ఆస్తులను ధ్వంసం చేస్తుంటే కనీసం స్పందించకపోవటం ఏంటని నారా లోకేష్ దృష్టికి తీసుకొచ్చారంట వైజాగ్ నేతలు, కార్యకర్తలు. కొన్ని నెలలుగా స్తబ్ధతగా ఉన్న గంటా శ్రీనివాసరావు వైఖరిపైనా లోకేష్ కొంత అసహనంగా ఉన్నారంట. నియోజకవర్గాల్లో పార్టీ నేతలను తయారు చేసుకోకపోతే భవిష్యత్ లో ఎన్నో ఇబ్బందులు వస్తాయని.. ఇప్పటికే చాలా సమయం అయ్యిందని.. మీరు ఏదో ఒకటి తేల్చుకోవాలంటూ గంటాకు అల్టిమేటం ఇచ్చారంట నారా లోకేష్.

గంటా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళతారనే ప్రచారం జోరుగా సాగింది. ముహూర్తం ఖరారు అని వార్తలు వచ్చాయి. ఈ సమయంలో కరోనా రావటం, ఆ వెంటనే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం తెరపైకి రావటంతో ఎటూ తేల్చుకోలేకపోయారు గంటా. ఏడాది కాలంగా టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నా.. ఆ పార్టీ తరపున కనీసం మాట్లాడటం కూడా లేదు గంటా.. ఇలా ఐడియల్ గా ఉండటంపైనే లోకేష్ అసహనంగా వ్యక్తం చేశారంట.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు