వాటికీ వెంటనే రంగు మార్చండి – నిమ్మగడ్డ ఆదేశం

ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో అర్ధం కావడం లేదు. గురువారం సాయంత్రం టీడీపీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను ఉపసంహరించుకోవాలి తెలిపారు. శుక్రవారం ఉదయం ఏకగ్రీవాలపై నివేదిక సమర్పించాలని గుంటూరు, చిత్తూరు కలెక్టర్లకు ఆదేశాలు జారీచేశారు. ఇక శుక్రవారం సాయంత్రం బొయ్యాం పంపిణి వాహనాల రంగులు మార్చాలని ఆదేశించారు. వాహనాలపై వైకాపా రంగులు ఉన్నాయని ఎస్‌ఈసీ అభిప్రాయపడింది. పార్టీలకు సంబంధం లేని రంగులు వేసి తేవాలని అధికారులకు సూచించింది.

అంతవరకు గ్రామాల్లో వాహనాలతో రేషన్‌ పంపిణీ నిలిపివేయాలని ఆదేశించింది. రంగులు మార్చాకే వాహనాల ద్వారా పంపిణీకి అనుమతిస్తామని స్పష్టం చేసింది. కాగా బుధవారం నిమ్మగడ్డ రమేష్ కుమార్ బియ్యం పంపిణి వాహనాలను పరిశీలించారు. స్వయంగా నడిపారు. అయితే ఎన్నికల సమయంలో పార్టీకి సంబందించిన రంగులు కానీ గుర్తులు కానీ కనిపించకూడదు.. పార్టీకి సంబందించిన రంగులు, గుర్తులు కనిపించడం కూడా ఓటర్లను ప్రభావితం చేసే అంశం కిందకే వస్తుంది. ఈ నేపథ్యంలోనే నిమ్మగడ్డ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

వాటికీ వెంటనే రంగు మార్చండి – నిమ్మగడ్డ ఆదేశం

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు