ఒంటరిగా వెళ్తే కష్టమే : శరద్ పవార్ నేతృత్వంలో థర్డ్ ఫ్రంట్

political parties forming third front

దేశంలో బీజేపీని అధికారం నుంచి దించేందుకు వివిధ రాజకీయ పార్టీలు ఏకమవుతున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టి ఏడేళ్లు గడుస్తుంది. మరో మూడేళ్లపాటు బీజేపీ అధికారంలో కొనసాగనుంది. ఇక 2024 సార్వత్రిక ఎన్నికల కోసం వివిధ పార్టీలు ఇప్పటినుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి.

ఒంటరిగా వెళితే విజయం సాధించలేమన్న ధోరణిలో కూటమిగా వెళ్లాలని భావిస్తున్నాయి బీజేపీ, కాంగ్రెస్ యేతర పార్టీలు. శరద్ పవర్ నాయకత్వంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసి 2024 ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఈ వార్తలకు బలం చేకూర్చే పరిణామాలు కూడా ఈ మధ్య జరుగుతున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో పది రోజుల వ్యవధిలోనే రెండు సార్లు భేటీ అయ్యారు శరద్ పవర్. వీరిద్దరూ థర్డ్ ఫ్రంట్ గురించి చేర్చించినట్లుగా తెలుస్తుంది. అయితే మంగళవారం శరద్ పవర్ 15 పార్టీల అగ్రనేతలతో ఏర్పాటు చేశారు. ఈ భేటీలో థర్డ్ ఫ్రంట్ గురించి చర్చించనున్నట్లు తెలుస్తుంది. ఎన్సీపీ నేత శరద్ పవర్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రీయ ఫ్రంట్ పేరుతో 15 పార్టీల నేతలు కలిసి థర్డ్ ఫ్రంట్ ను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు.

ఈ నేపథ్యంలోనే మంగళవారం ఢిల్లీలోని శరద్ పవర్ నివాసంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో శరద్‌ పవార్‌తో పాటు ఫరూక్‌ అబ్లుల్లా, యశ్వంత్‌ సిన్హా, పవన్‌ వర్మ, సంజయ్‌ సింగ్, డి.రాజా, జస్టిస్‌ ఏపీ సింగ్, జావేద్‌ అక్తర్, కేటీఎస్‌ తులసి, కరణ్‌ థాపర్, అశుతోష్, న్యాయవాది మజీద్‌ మెమొన్, మాజీ చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ ఎస్‌వై ఖురేషీ, కేసీ సింగ్, సంజయ్‌ ఝా, సుదీంధ్ర కులకర్ణి, ఆర్థికవేత్త అరుణ్‌ కుమార్, ఘన్‌శ్యామ్‌ తివారీ, సహా పలువురు పాల్గొంటారు.

అయితే వీరి భేటీలో రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో అధికార బీజేపీని ఎలా ఇరకాటంలో పెట్టాలనే దానిపై చర్చించనున్నట్లు తెలుస్తుంది. ఈ సమావేశంలో 2024 సార్వత్రిక ఎన్నికలకు ప్రణాళిక తయారు చేస్తారని తెలుస్తుంది. ఆ ప్రణాళిక ప్రకారం సార్వత్రిక ఎన్నికలకు వెళ్లాలని శరద్ పవర్ భావిస్తున్నట్లు తెలుస్తుంది.

ఇదిలా ఉంటే థర్డ్ ఫ్రంట్ తో బీజేపీని ఓడించడం సాధ్యం కాదని ప్రశాంత్ కిషోర్ తేల్చి చెప్పారు. మూడో ఫ్రంట్, నాలుగో ఫ్రంట్ తో బీజేపీని ఓడించడం సాధ్యం కాదని ఆయన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు