తానా, టాటా, NRIలకు లేఖలు రాస్తున్న ఎంపీ రఘురామ రాజు మిగిలింది అదొక్కటే అంటున్న విదేశీయులు

జగన్ బెయిల్ రద్దు పిటీషన్ సరే.. ఎగ్గొట్టిన రూ.273 కోట్లపై విచారణకు రండీ : రఘురామకృష్ణంరాజుకు సీబీఐ షాక్

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణ రాజు వ్యవహారం మరింత ముదిరింది. బెయిల్ పై ఆర్మీ ఆస్పత్రి నుంచి వచ్చిన తర్వాత.. ఢిల్లీ వెళ్లి స్పీకర్, రక్షణ శాఖ మంత్రితోపాటు అందర్నీ కలుస్తూ వచ్చారు. తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ దేశంలోని ఎంపీలందరికీ లేఖలు రాస్తున్నారు. పార్టీలు, ప్రాంతాలు, కులాలు, మతాలతో సంబంధం లేకుండా తనకు జరిగిన అన్యాయం ఇదీ అంటూ లేఖలు రాశారు. లేటెస్ట్ గా ఆయన చేసిన వ్యవహారం అంతర్జాతీయంగా హాట్ టాపిక్ అయ్యింది.

దేశం మొత్తానికి తన గురించి చెప్పేసిన ఎంపీ రఘురామ కృష్ణ రాజు.. అలవాటైన లేఖలు రాయటాన్ని ఆపలేదు. దేశంలోని అందరూ అయిపోవటంతో ఇప్పుడు ఏకంగా NRIలను టార్గెట్ చేశారు. విదేశాల్లోని తెలుగోళ్లు అందరికీ ఎంపీలకు రాసిన లేఖలను పంపిస్తున్నారంట. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నారన్త్ అమెరికా (తానా), ట్రయాంగిల్ ఏరియా తెలుగు అసోసియేషన్ (టాటా), అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా)లతోపాటు కాలిఫోర్నియా, టెక్సాస్, బూస్టన్, చికాగో, ఫ్లోరిడా, డల్లాస్, డెట్రాయిట్ ప్రాంతాల్లో తెలుగు అసోసియేషన్లు అందరికీ కూడా లేఖలు పంపిస్తున్నారు ఎంపీ రఘురామ రాజు.

ఎంపీ లేఖలు అందుకుంటున్న NRIలు సంభ్రమాశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్ర అయిపోయింది.. ఇండియా అయిపోయింది.. ఇప్పుడు అమెరికాపై పడ్డారా అంటూ కితకితలకు పోతున్నారు. భారతదేశంలోని అన్ని పార్టీల ఎంపీలకు రాసిన లేఖలను.. మెయిల్ ద్వారా ఆయా అసోసియేషన్లకు, ఎన్నారైలకు పంపడం ద్వారా రఘు రామకృష్ణ రాజు.. ఈ ఇష్యూను మరికొంత కాలం కొనసాగించాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ఎంపీ లేఖలు చూసిన ఎన్నారైలు.. ఇక మిగిలింది FBI.. బైడెన్, కమలా హారిస్ మాత్రమే మిగిలారని.. వాళ్లతోపాటు లండన్, జర్మనీ, జపాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక దేశాల్లోని తెలుగోళ్లతోపాటు ఇతర రాష్ట్రాల వారికీ కూడా పంపిస్తే ఓ పనైపోతుంది కదా అంటూ సెటైర్లు వేసుకుంటున్నారంట..

ఏమైనా రఘురామ కృష్ణ రాజు రూటే సెపరేట్ అంటున్నారు. పోరాటం ఎందాకైనా అంటున్నారు. దేశంలోని ఆర్మీపైనే అనుమానం వ్యక్తం చేసిన ఎంపీ.. ఎన్నారైలను ఇష్యూలోకి లాగటం పెద్ద లెక్కా చెప్పండీ.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు