లగడపాటి దారిలోనే.. రఘురామకృష్ణం రాజు – ఏపీలో అడుగుపెట్టనంటూ శపథం

లగడపాటి దారిలోనే.. రఘురామకృష్ణం రాజు - ఏపీలో అడుగుపెట్టనంటూ శపథం

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పారిపోయారు. గెలిపించిన నియోజకవర్గ ప్రజలను గాలికి వదిలేసి పరార్ అయ్యారు. ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండనని స్వయంగా ప్రకటించారు. ఏప్రిల్ 7వ తేదీ ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా ప్రకటించి కలకలం రేపారు.

సీఎం జగన్ బెయిల్ రద్దు అయ్యే వరకు పోరాడతానని.. జగన్ రాముడో.. రావణుడో తేల్చే వరకు ఉద్యమం ఆగదని ప్రకటిస్తూ.. ఈ నిర్ణయాన్ని ప్రకటించటం కలకలం రేపుతోంది.

సీఎం జగన్ కేసుల విషయం తేలే వరకు ఏపీలో అడుగు పెట్టను.. బెయిల్ రద్దు పిటీషన్ దాఖలు చేసిన తర్వాత బెదిరింపు కాల్స్ వస్తున్నాయి అని చెప్పారు. బెదిరింపులకు భయపడి ఏపీలో అడుగు పెట్టను అని అంటున్నారా అని ప్రశ్నిస్తే.. వాళ్ల బెదిరింపులకు ఎవరూ భయపడటం లేదంటూ కౌంటర్ ఇచ్చారు. మరి అలాంటప్పుడు ఏపీలో ఎందుకు అడుగు పెట్టను అని శపథం చేస్తున్నారు అంటే.. నాపై ఏదో కుట్ర జరుగుతుంది అంటున్నారు. దీనిపై ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాకు కంప్లయిట్ చేస్తాను అంటున్నారు.

ప్రస్తుతం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఢిల్లీలో ఉన్నారు. ఇక నుంచి కూడా అక్కడే ఉండనున్నారు. ఎంపీగా ఇచ్చిన క్వార్టర్స్ తోపాటు.. ఆయనకు సొంత గెస్ట్ హౌస్ లు ఉన్నాయి. ఇక నుంచి రఘురామకృష్ణంరాజు కేరాఫ్ అడ్రస్ ఢిల్లీ.

ఈయనగారి శపథం చూస్తుంటే.. గతంలో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ గుర్తుకొచ్చారు అంటున్నారు తెలుగు ప్రజలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి ఏకంగా మాయం అయిపోయారు.. జగన్ కేసులపై శపథం చేసిన ఈ తిరుగుబాటు ఎంపీ పరిస్థితి సైతం రాబోయే రోజుల్లో లగడపాటి తరహాలోనే ఉండబోతుందా అనేది ఇంట్రస్టింగ్ పాయింట్.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు